గద్వాల, ఆగస్టు 8 : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు.. ప్రస్తుతం అమలు చేస్తున్న హామీలకు పొంతన లేదని.. దీంతో ప్రజలతోపాటు రైతులూ అవస్థలు పడుతున్నారు. జోగుళాంబ గ ద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గ ప్రజలకు ఏపీలో ని కర్నూల్‌తో విడదీయరాని సంబంధాలు ఉన్నాయి. వ్యాపార లావాదేవీల కోసం అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎక్కువగా ఈ నగరానికే వెళ్తుంటారు. అదే క్ర మంలో మన రైతులు అక్కడున్న బ్యాంకుల్లో వ్యవసా య రుణాలు తీసుకున్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అలంపూర్‌కు చెందిన వివిధ గ్రామాల ప్ర జలు కర్నూల్లోని కెనరా, యాక్సిస్‌తోపాటు పలు బ్యాంకుల్లో వ్యవసాయ అవసరాల కోసం రుణాలు తీసుకున్నారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీలో వీరికి రుణమాఫీ వర్తించలేదు. దీనికి నిరసనగా తమకూ రుణమాఫీ వర్తింపజేయాలని, ఇందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గత సోమవారం గద్వాల జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టి కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
30 ఏండ్లుగా అలంపూర్ నియోజకవర్గంలోని పల్లెపాడ్, చండూర్, ఇటిక్యాల, జల్లాపురం, పుల్లూరు, బో రవెళ్లి, జింకలపల్లితో ఇతర గ్రామాలు ఏపీలోని కర్నూలకు అతి సమీపంలోనే ఉంటాయి. దీంతో ఈ గ్రామాలకు చెందిన 350 నుంచి 400 మంది రైతులు కర్నూల్ బ్యాంకుల్లో రుణాలు పొందారు. గత బీఆర్ఎస్ ప్రభు త్వం రుణమాఫీ చేసినప్పుడు వీరందరికీ వర్తింపజేశా రు. దీంతోపాటు రైతుబంధు కూడా ఆయా బ్యాంకుల్లో జమయ్యేవి. కానీ, కర్నూల్ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాలను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మాఫీ చేయలేదు.
అసెంబ్లీ ఎన్నికల ముందు రుణమాఫీ గు రించి మేనిఫెస్టోలో ఇతర రాష్ర్టాల్లో ఉన్న పంట రుణాలు చెల్లవని పొందుపర్చలేదని, మేమంతా తెలంగాణ రైతులమే.. అయినా మాకు రుణమాఫీ ఎందుకు కావడం లేదని పలు గ్రామాల కర్షకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. కాంగ్రెస్ నాయకులు ఎన్నికల సమయంలో ఒక మాట.. అధికారంలోకి వచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. మేము తె లంగాణ రైతులమే కాబట్టి మాకు రుణమాఫీ చేయాలని లేకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించా రు.
రైతులు కలెక్టరేట్ ఎదుట ధర్నా చేయగా కర్నూల్లో రుణాలు తీసుకున్న తెలంగాణ రైతులకు సంబంధించి వ్యవసాయశాఖ కమిషనర్‌కు లేఖ పంపమని కలెక్టర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారిని ఆదేశించినట్లు తెలిసిం ది. అయితే వాస్తవంగా ఏ ఏరియా పరిధిలో ఉన్న వారి కి అక్కడే వ్యవసాయ రుణాలు ఇవ్వాలి గానీ.. గతంలో బ్యాంకులు, సర్వీస్ నిబంధనలకు వ్యతిరేకంగా రుణాలు ఇచ్చారు. ఒక రాష్ట్రంలో రుణాలు తీసుకున్న వారికి ఇంకో రాష్ట్రంలో రుణమాఫీ ఎలా అవుతుందని అధికారులతోపాటు బ్యాంకర్స్ చెప్పడం కొసమెరుపు.
కర్నూల్ కెనరా, యాక్సిస్ బ్యాంకుల్లో రుణా లు తీసుకున్న వారికి రుణమాఫీ చేయాలని ప్రభు త్వం జీవో ఇస్తే చేస్తాం.. నిబంధనల ప్రకారం విచారణ చేసి వారికి కూడా రుణమాఫీ అయ్యేలా చూస్తాం. వారి నిర్ణయం మీదే మాఫీ ఆధారపడి ఉంది. – అయ్యపురెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్
నాకు ఎడెకరాల పొలం ఉన్నది. కర్నూల్ కెనరా బ్యాంక్‌లో రూ.4 లక్షల అ ప్పు తీసుకున్నాను. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పు డు రుణమాఫీ జరిగింది. కేసీఆర్ మొదటిసారి మాఫీ చేసినప్పుడు కూడా అ య్యింది. ఆ తర్వాత రెండోసారి ఎన్నికల కోడ్ నేపథ్యంలో కాలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మాఫీ కాలేదు. తెలంగాణ ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి మాకు రుణమాఫీ వర్తింపజేయాలి. మేము తెలంగాణ రైతులం.. మా పొలాలు ఇక్కడే ఉన్నాయి.
– సత్యారెడ్డి, పల్లెపాడ్, మానవపాడు
నాకు నాలుగు ఎకరాల పొలం ఉన్నది. కర్నూల్ కెన రా బ్యాంక్‌లో రూ.లక్షా 60 వేలు అప్పు తీసుకున్నాను. గతంలో మాకు రుణమాఫీ జరిగింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఒకసారి రుణమాఫీ అయ్యింది. తర్వాత కాలే దు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ కాలేదు. మా పంట పొలాలు తెలంగాణలోనే ఉన్నాయి. మేమూ తెలంగాణలోనే ఉ న్నాం.. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మాకు రుణమాఫీ వర్తింపజేయాలి.
– నాగేంద్ర, పల్లెపాడ్, మానవపాడు