అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 4 : మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార్కెట్ యార్డు గేటుకు తాళం వేసి రైతులు నిరసనకు తెలిపారు. 15 రోజుల కిందట మార్కెట్లో ప్రార ంభించిన కొనుగోలు కేంద్రానికి మక్కలు తీసు కొస్తే నామమాత్రంగా కొంటు న్నారని ఆగ్రహం చెందారు. దీంతో నిద్రాహారాలు మానుకొని రాత్రిళ్లు కే్ంర దాల వద్ద జాగారం చేయాల్సి వస్తుందని వాపోయారు. కలుగొట్ల సొసైటీ నుంచి కొనుగోలు చేయకుండా మార్కెట్ ద్వా రా కొంటూ రాజకీయం చేస్తు న్నార న్నా రు. ఇబ్బందులకు గురిచేస్తే ఒరిగేదేమీ లేదన్నారు.
ఇప్పటి వరకు 9 లారీలకు మక్క కొనుగోలు చేశారని, కా నీ 2 లారీ లు మాత్రమే లోడ్ చేసి పం పించారని ఆవేదన చెందారు. దీంతో మి గతా లారీ లు లోడ్ చేయకపోవడంతో మార్కెట్ లోనే మొక్కతో పడిగాపులు కా యాల్సి వస్తుందన్నారు. దీనికితోడు వ ర్షం ఎప్పుడు వస్తుందోనన్న ఆందోళన కంటి మీద కునుకు రాకుండా చేస్తుం దన్నారు. యార్డులో గుమాస్తాదే ఇష్టారా జ్యమైం దని ఆరోపించారు. కేంద్రాల్లో తేమ పరిశీలించి కొన్నాక గోదాముకి తరలిస్తే అక్కడ గుమాస్తా తేమ శాతం తక్కువగా ఉందంటూ వేధింపులకు గురిచేస్తున్నా రని, డబ్బులు ఇస్తే తేమ పరిశీలించ కుండానే లారీల్లో లోడ్ చేయిస్తున్నారని వాపోయారు.
కలుగొట్ల సొసైటీ నుంచి రైతులు తేస్తున్న మక్కను గుమాస్తా కొనుగోలు చేయకుండా క్యాతూరు, అలంపూర్ సొసైటీ నుంచి వచ్చే పంటను కొంటున్నారని మండి పడ్డారు. క్వింటాకు హమాలీలకు రూ.65 రైతులే భరిస్తున్నారని, దీనికి తోడు లారీ ఓనర్లు సంచి కి రూపాయి చొప్పున వసూ లు చేస్తున్నారని వాపోయా రు. విషయం తెలుసుకొన్న ఎస్సై శేఖర్ మార్కెట్ వద్ద కు వెళ్లి ఉన్నతాధి కారులతో మాట్లాడి సమస్య పరిష్కా రాని కి కృషి చేస్తామని చెప్పారు. దీంతో రైతులు శాంతి ంచారు.