ధన్వాడ, మార్చి 2 : ఓవైపు తీవ్ర ఎండలు.. తగ్గుతున్న నీటిమట్టం.. దీనికి తోడు కరెంట్ కోతలతో అన్నదాతలు విలవిలలాడుతున్నారు. అప్పులు చేసి సాగు చేసిన పంటలు ఎండుతుండడంతో దిక్కుతోచని స్థితిలో దిగాలు చెందుతున్నారు. మండలంలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
మం డలంలోని కంసాన్పల్లికి చెందిన రైతు కుర్వ వెంకటయ్య తన వ్యవసాయ పొలంలో బోరు కింద మూ డెకరాల వరిసాగు చేశాడు. పంట పొట్ట దశలో ఉండ గా.. పంటకు సరిపడా నీరందక ఎండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశాడు. అలాగే మందిపల్లికి చెందిన రైతు గొల్ల శ్రావణ్ రెండెకరాల వరిపంట సాగు చేస్తే ఎండిపోయిందని, పంటను కాపాడుకోవడానికి బోరు వేసినా నీరు రాకపోవడంతో దిక్కుతోచని దిగులు చెందున్నాడు. పంటలు ఎండి పోయినవారిని ప్రభుత్వం ఆదుకోవాలని ఆయా గ్రామాల రైతులు డిమాండ్ చేస్తున్నారు.