పెద్దమందడి, ఏప్రిల్ 21 : ప్రజా ప్రభుత్వం అనే చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం తమ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటేనే కష్టాలు అని మరోసారి రుజువు చేసుకుంది. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లి గ్రామంతోపాటు ఆయా గ్రామాలలో లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల దగ్గరే దాన్యపు బస్తాలు నిలువ ఉన్నాయి. దొడగుంటపల్లి ఒక గ్రామంలోనే దాదాపు 4 వేల బస్తాల వరకు నిలువ ఉండడం గమనార్హం. ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా భారీ ఈదురు గాలులతో కూడిన కురిసిన వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వ వైఫల్యం లేక అధికారుల నిర్లక్ష్యమో కానీ రైతుల పాలిట కాంగ్రెస్ ప్రభుత్వం శాపంగా మారింది. ప్రజా ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న నాయకులు రైతులకు కష్టాలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క గ్రామంలోనే 4000 బస్తాలు నిల్వ ఉన్నాయంటే మిగిలిన మండలం లోని మిగతా గ్రామాలలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఇప్పటికైనా అధికారులు స్పందించి లారీలను ఎక్కువగా పంపించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలువురు రైతులు వేడుకుంటున్నారు.