ఆదుకొనేరా?
కాంగ్రెస్ పాలనలో మక్క రైతులు అరిగోస పడ్తున్నారు. ఆ రుగాలం కష్టపడి పండించి విక్రయించేందు కు మార్కెట్‌కు తెచ్చినా అధికారుల నిర్లక్ష్యం తో పడిగాపులు తప్పడం లేదు. ముందస్తు ప్ర ణాళిక లేకపోవడం కారణంగా పంటను స్వే చ్ఛగా అమ్ముకునే వీలు లేకుండా పోయింది. అరకొరగా అందిన సాగునీటితో, పందుల బెడద నుంచి పంటలను కాపాడుకొని..
- కందనూల్ మార్కెట్‌ను ముంచెత్తిన మక్క
- కొనుగోలులో అధికారుల తీవ్ర జాప్యం
- గన్నీ బ్యాగులు, లారీల కొరతే కారణం?
- 23 వరకు యార్డుకు తేవద్దంటూ నోటీస్
- ఐదు రోజులుగా ఆరబెట్టుడు.. కుప్ప వేస్తూ..
- అధికారుల తీరుపై అన్నదాతల ఆందోళన
నాగర్‌కర్నూల్, ఏప్రిల్ 16 : కాంగ్రెస్ పాలనలో మక్క రైతులు అరిగోస పడ్తున్నారు. ఆ రుగాలం కష్టపడి పండించి విక్రయించేందు కు మార్కెట్‌కు తెచ్చినా అధికారుల నిర్లక్ష్యం తో పడిగాపులు తప్పడం లేదు. ముందస్తు ప్ర ణాళిక లేకపోవడం కారణంగా పంటను స్వే చ్ఛగా అమ్ముకునే వీలు లేకుండా పోయింది. అరకొరగా అందిన సాగునీటితో, పందుల బెడద నుంచి పంటలను కాపాడుకొని.. కోతలు పూర్తి చేసి అమ్ముదామని మార్కెట్‌కు తీసుకొస్తే ఇంత అలసత్వమా? అంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2 లక్షల ఎకరాల్లో సాగైన మక్క
ఈసారి యాసంగిలో నాగర్‌కర్నూల్ జిల్లాలో 2,00,492 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట ను సాగు చేశారు. అయితే దాదాపు 7 లక్షల టన్ను లు దిగుబడి వస్తుందని అధికారుల అంచనా.. ఇప్పటికే సగానికిపైగా పంట దిగుబడి వచ్చినట్లు తెలిసింది. సాగునీటి కష్టాలను దాటుకొని.. పంటలను కాపాడుకొని చివరకు విక్రయానికి మార్కెట్‌కు తీసుకొస్తే కొనుగోలు లేక అన్నదాతలు తీవ్ర అవస్థలు పడ్తున్నారు. అధికారుల ముందస్తుల ఆలోచన లేకపోవడం, అవసరమైన గన్నీ బ్యాగులు, తరలిచేందుకు రవాణా ఏర్పాట్లు చేసుకోవడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీంతోపాటు జిల్లా వ్యాప్తంగా విక్రయానికి వచ్చిన పంటకు సరిపడా కొనుగోలు కేంద్రాలను సైతం ఏర్పాటు చేయలేదు. అధికారుల నిర్లక్ష్యంతో నాగర్‌కర్నూల్ వ్యవసాయ మార్కెట్‌ను మొక్కజొన్న రాసులు ముంచెత్తాయి. అయితే సరిపడా గన్నీ బ్యాగులు లేకపోవ డం.. లారీల కొరతతో కొనుగోలు చేయకపోవడం తో ఐదు రోజులుగా మార్కెట్లోనే మక్క ఉండిపోయి ంది. ఇలాంటి పరిస్థితుల్లో అకాల వర్షాలు వస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నా రు. గురువారం సైతం అధిక మొత్తంలో మార్కెట్ రావడంతో కొనుగోలు చేయలేదు. చాలా సే పు స్థలం లేదంటూ గేటును మార్కెట్ అ ధికారులు తెరవలేదు. దీంతో రోడ్డు పొడవునా మక్కను తెచ్చిన వాహనాల బారులే కనిపించాయి.
పెద్ద మొత్తంలో మార్కెట్‌కు మక్క వస్తుందని ముందుగానే అధికారులు అంచనా వేయలేకపోయారు. కొనుగోలు చే సేందుకు సరైన గన్నీ బ్యాగులు తెప్పించకపోవడం విఫలమయ్యారని రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు చేయకపోవడంతో ఆం దోళన చేశారు. ఈనెల 23వ తేదీ వరకు మా ర్కెట్‌కు ధాన్యం తీసుకురావద్దని, ఇక్కడ స్థలం లేదంటూ అధికారులు గేటుకు నోటీసు అంటించారు. దీనిపై రైతులు కన్నెర్ర చేస్తున్నారు. అయినా కాంటా వేయకపోవడంతో ఇబ్బందులు పడుతూ.. రోజూ మక్కను ఆరబెడుతూ.. కుప్ప వేస్తూ నిరీక్షించాల్సి వస్తుందని వాపోతున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మార్కెట్లో కొనుగోలు ప్రక్రియను వేగవం తం చేయాలని అన్నదాతలు విజ్ఞప్తి చే స్తున్నారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Batukamma | మెట్ల బావి వద్ద బతుకమ్మ సందడి.. మహిళలతో కలిసి కోలాటం ఆడిన ఎమ్మెల్యే..!
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్‌కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

