గట్టు, ఆగస్టు 12 : యూరియా కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. యూరియా కోసం రోజుల తరబడి పీఏ సీసీఎస్ కార్యాలయానికి తరలివస్తున్నారు. అయినా యూరి యా లభించడం లేదని రైతులు వాపోతున్నారు. గత కొద్ది రోజుల నుంచి పీఏసీసీఎస్లో యూరియా పంపిణీని ప్రారం భించారు. ఇప్పటిదాకా 1800 బస్తాల యూరియాను మా త్రమే అధికారులు పంపిణీ చేశారు. అయితే ఇది రైతులకు ఏమాత్రం చాలడం లేదు. ఒకటి, రెండు లారీల యూరియా మాత్రమే దిగుమతి అవుతుండడంతో అది రైతులకు సరి పోవడం లేదు. యూరియా కోసం మహిళా రైతులు సైతం పీఏసీసీఎస్ కార్యాలయానికి తరలి వస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
వర్షాభావ పరిస్థితుల సమయంలో ఫ ర్టిలైజర్ దుకాణాల నిర్వాహకులు పెద్దఎత్తున యూరి యాను దిగుమితి చేసుకుని కర్ణాటకకు తరలించి సొమ్ము చేసుకోవడంతో పరిస్థితి ఈ విధంగా తయారైందని రైతు లు బాహాటంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కూడా వారి దుకాణాల గోదాంలలో పెద్ద ఎత్తున యూరియా స్టాక్ ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పది బస్తాల కాంప్లెక్స్ ఎరువులను కొంటేనే ఒకటి, రెండు బస్తాల యూరియాను అమ్ముకుంటూ ఫర్టిలైజర్ దు కాణాల యజమానులు సొమ్ముచేసుకుంటు న్నారు.
ఎరువులు కర్ణాటకకు పెద్దఎత్తున తరలి నా కూడ వ్యవసాయాధి కారులు చూసీ చూడ నట్లు వ్యవహరించడంలో ఎరువుల కొరత ఏర్పడిందని రైతులు విమర్శిస్తున్నారు. జిల్లా ఉన్నతాధికారుల నిఘా ఏమాత్రం లేకపో వడంతో ఫర్టిలైజర్ దుకాణాల నిర్వహకులు, వ్యవసాయాధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు. ఇకనైనా కలెక్టర్, జిల్లా వ్యవసాయాధికారి చర్యలు తీసుకుని మండలంలోని రైతులకు యూరియా అందుబాటులో ఉండే చూడాలని మండలంలోని రైతులు కోరుతున్నారు.
యూరియా కోసం ఇంతకు ముందు ఓ రోజు వచ్చాను. అయితే రైతులు ఎక్కువగా ఉండడంతో మరోసారి రావాలని అధికారులు చెప్పారు. దీంతో ఈరోజు వచ్చి జిరాక్స్ ప్రతులు పెట్టాను. యూరియా దొరుకుతుందో..లేదో చూడాలి మరి.
– రాఘవేంద్రచారి, రైతు, పెంచికలపాడు
యూరియా కోసం రైతులు పడుతున్న అగచాట్లు నేను ఇంతవరకు చూడలేదు. గతంలో యూరియాకు ఎలాంటి కొరత లేకుండె. ఇప్పుడేమో ఈ పరిస్థితి దాపురించింది. రైతులకు టోకెన్లు కేటాయించి నిర్ణీత రోజును సూచిస్తే రైతులు అదేరోజు వచ్చి యూరియాను తీసుకుంటారు. ఇప్పుడేమో గంటల సమయాన్ని యూరియా తీసుకోవడానికే వెచ్చించాల్సి వస్తోంది.