నాగర్కర్నూల్, ఫిబ్రవరి 17 : యూరియా కోసం రైతు పడుతున్న కష్టాలు అన్నిఇన్నీ కావు. వానకాలంలో పడిన ఇబ్బందులకంటే యాసంగిలో వారు పడుతున్న అవస్థలు వర్ణణాతీతం. నాగర్కర్నూల్ జిల్లాలోని బిజినేపల్లి, తెలకపల్లితోపాటు పలు మండలాల్లో ఆన్లైన్లో యూరియా స్టాక్ జీరోగా చూపించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హ యాంలో రైతులకు యూరియాను నేరుగా అందించి పంటల దిగుబడికి సహకరించి రైతును ఆదుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు సరిపడా యూరియాను అందించలేకపోగా ఆన్లైన్లో యాప్ ద్వారా బుకింగ్ చేసుకున్న రై తులకే యూరియా అందిస్తుండడంతో సమయానికి అందక నానా అవస్థలు పడుతున్నామని పలువురు రైతులు పేర్కొంటున్నా రు. యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలనే కొత్త సిస్టంను తీసుకురావడంతో పెద్దఫోన్లు లేని రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రు.
ఆన్లైన్లో స్టాక్ వివరాలు చూసేలోపే జీరోగా కనిపిస్తుందని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఒక ఎకరాకు నాలుగు బ స్తాల యూరియా ఇస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, ఆ విధంగా రైతులకు ఎ క్కడా అందడం లేదు. పంట ఎదుగుతున్న సమయంలో యూరియా వేస్తే సరైన దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ రైతులకు అవసరమైన సమయంలో యూరి యా అందించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం గా వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. యూరియా స్టాక్ వచ్చిన విషయం తెలుసుకొని దుకాణాల వద్దకు వెళ్లేలోపే ఖాళీ అవుతున్నాయని, యాప్ ద్వారా చూ సి బుకింగ్ చేసుకొని తెచ్చుకునే విషయం లో మధ్య తరగతి రైతులు నానా అవస్థలు పడుతున్నారు.
జిల్లాలోని ఆగ్రో సెంటర్లు, పీఏసీసీఎస్లు ఇతర దుకాణాలకు యూరి యా స్టాక్ వచ్చిన కొద్ది సేపటికే దొరకకుం డా పోతుందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఫోన్లు లేని రైతులు తమకు ఏ దుకాణం పరిధిలో యూరియా వస్తుందని తెలుసుకునేలోపే యూరియా అయిపోయినట్లుగా బోర్డులు పెడుతున్నార ని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.యూరియా స్టాక్ వస్తున్న విషయం వ్యవసాయాధికారులకు, దుకాణాదారులకు ముందుగానే స మాచారం రావడంతోవారు కుమ్మక్కై ముం దుగానే బుకింగ్ చేసుకొని చిన్న సన్నకారు రైతులకు దొరకకుండా చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సకాలంలో యూరియా ను చల్లుకోకపోతే పంటదిగుబడి తగ్గు తుం దని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.