చారకొండ, జూలై 10 : పత్తిపంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం రాంపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. ఏఎస్సై అంజయ్య కథనం ప్రకారం.. చారకొండ మండలం రాంపూర్‌కు చెందిన వంగూరు వెంకట్నారిగౌడ్(54) తనకున్న 8ఎకరాల్లో పత్తిపంటను సాగు చేశాడు.
వర్షాలు సరిగా కురువకపోవడంతో పత్తి మొక్కలకు నీళ్లు పెట్టేందుకు బోరుమోటర్ పెట్టడానికి స్టాటర్ వద్దకు వెళ్లి ఆన్ చేశాడు. షాట్‌సర్క్యూట్‌తో కిందపడిపోయాడు. సమీపంలో ఉన్న వెంకట్ నారిగౌడ్ చిన్న కు మారుడు శివశంకర్‌గౌడ్ వెంటనే గుర్తించి చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానకు తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భా ర్య భారత మ్మ, ఇద్దరు కుమారులు, కు మార్తె ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.
ఖిల్లాఘణపురం, జూలై 10 : విద్యుదాఘాతంతో మరో రైతు మృతి చెందిన ఘట న మండలంలోని సల్కలాపురంలో గురువారం చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే సల్కలాపురం గ్రామానికి చెందిన నాగన్న వ్యవసాయ పొలంలో గురువారం వరి చేను కు నీరు పెట్టేందుకు విద్యు త్ స్టార్టర్ వద్ద మో టర్ వేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ వైర్లు తగలడంతో విద్యుదాఘా తంతో అక్కడిక్కడే మృతిచెందినట్లు చెప్పా రు. మృతుని భార్య ఇచ్చి న ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు.