ధన్వాడ, అక్టోబర్ 23 : మద్దతు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నామని, వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని బుధవారం స్థానిక రైతువేదిక వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గున్ముక్ల మాజీ ఎంపీటీసీలు శ్రీనివాసులు, సుధీర్కుమార్రావు మాట్లాడుతూ పత్తి కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తూ రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు.
ఇప్పటికైనా స్పందించి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం తాసీల్దార్ సింధూజ, ఏవో దినకర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రైతులు శివారెడ్డి, శంకర్, నర్సింహులు, శ్రీనివాస్‌గౌడ్, సాంబశివుడు, ఆంజనేయులు, తిమ్మయ్య, బాలకృష్ణ, వీరాంజనేయులు, వంశీగౌడ్, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.