గండీడ్/మహ్మదాబాద్ ఆగస్టు 25 : సహకార సంఘంలో డివిడెండ్ ఫండ్ అని ఒకటి ఉంటుందని రైతులకు తెల్వదు. ఇటు పా లకవర్గ సభ్యులకు తెల్వదు, తెలిసినా ఇవ్వరు. ఈ ఫండ్ గురించి ఎవరికీ తెలవకపోవడమే సహకార సిబ్బందికి వరంగా మారింది. డివిడెండ్ ఫండ్ గోల్మాల్ చేయడానికి వారికి మంచి అవకాశం దొరికిం ది. అసలు డివిడెండ్ ఫండ్ అంటే ఏ మిటీ అసలు విషయం తెలుసుకుందాం. రైతులు తీసుకున్నప్పు రుణం మొ త్తంపై 10 శాతం షేర్స్ (వాటా)రూపంలో సొసైటీ ఖాతా లో ఆ రైతు పేరిట జమచేస్తారు.
దీనిపై వచ్చిన లాభాలను షేర్స్ పెట్టిన రైతులకు కొంత మొత్తం తిరిగి రైతుల ఖాతాలో జమచేసే ఫండ్‌నే డివిడెండ్ ఫండ్ (ప్రోత్సాహక నగదు) అంటారు. ఏ సంస్థ అయిన వచ్చిన లాభాలను వాటాదారులకు పంచే విధానం. గతంలో మండలంలో 6 సహకార సంఘాలు ఉండేవి. రుసుంపల్లి, గండీడ్, వెన్నాచేడ్, మోకర్లబాద్, నంచర్ల, మహ్మదాబాద్ గ్రామాల్లో ఉండేవి. 2005 సంవత్సరంలో ప్రభుత్వం ఆరింటిని కలిపి మండలానికి ఒక్కటిగా గం డీడ్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసింది.
సహకార సంఘాలు విలీనం కాకా ముందుకే వాటా ధనం దాదా పు రూ.2.50 కోట్లపైగానే ఉన్నట్లు సమాచారం. ఆనాటి నుంచి వాటాధనంపై వచ్చిన ప్రోత్సాహక నగదు మా త్రం ఏ ఒక్కరికీ చెల్లించలేదు. ఈ రివార్డును సంఘానికి ప్రభుత్వం అందిస్తుంది. దీ నిని ఏడాదికి ఒక్కసారి సం ఘం రైతులకు రివార్డులను అందించాలి. ఈ రివార్డు చూడడానికి చిన్నగానే ఉన్నా రూ.లక్షల్లో ఉంటుంది. ఒక్కో రైతుకు వచ్చేది రూ.వంద, రూ.రెండోందలే అయినప్పటికీ రైతులకు ఇవ్వకుండా సిబ్బంది వాడేసుకున్నారు. ఈ రివార్డు ఫండ్ దాదాపు 2005 నుంచి నేటి వరకు దాదాపు రూ.26 లక్షల పైమాటే.
రుణాలు ఇస్తున్న కొద్దీ ఈ షేర్స్ పెరుగుతుంటాయి. మనకు తెలిసిన వివరాల ప్రకారం సుమారు రూ.26 లక్షలకు పైగానే ఉంటుంది. పూర్తి వివరాల కోసం కార్యాలయానికి వెళ్లిన సిబ్బంది తమ దగ్గర లేదంటూ ఒకరిపై ఒకరు చెప్పి ఇస్తాం అంటూ పూర్తి సమాచారం ఇవ్వడం లేదు. షేర్స్‌ను మాత్రం గుటకాయ స్వాహా చేయకుం డా వదిలి పెట్టారు. రైతు షేర్సు కూడా తీయడానికి వచ్చి ఉంటే ఈ పాటికే ఆ నిధులను కూడా మింగేసేవారు.
ఈ ఫండ్‌ను రైతులకు నగదు రూపంలో లేదా ఖాతాలో గానీ జమచేయాలి. కానీ ఇప్పటి వరకు ఏ వి ధంగానూ రైతులకు ముట్టలేదు. ఇది రైతులకు అందే లా అధికారులు చర్యలు తీసుకోవాలని వివిధ గ్రామాల రైతులు కోరుతున్నారు. గండీడ్ పీఏసీసీఎస్ సీఈవో ఆశన్నను వివరణ కో రగా.. కొన్నేండ్ల నుంచి షేర్స్‌పై ప్రోత్సాహక నగదు సొ సైటీకి వచ్చేదని, ప్రస్తుతం బ్యాంకు వారే రైతుల ఖా తాల్లో డిపాజిట్ చేస్తున్నారన్నారు. పూర్తి సమాచారం అయితే తన వద్ద లేదని చెప్పారు.