మాగనూరు, మే 5: మండలంలోని వడ్వాట్ వైష్ణవి రైస్ మిల్లులో ధాన్యం బస్తాలు దింపుకోకుండా రైస్‌మిల్లు యజమాని తాళం వేసుకొని వెళ్లాడని.. రైస్‌మిల్లు వద్ద ఎదురుచూస్తున్న రైతులు ధర్నాలు చేస్తేనే ధాన్యం కొంటారా అని ఆవేదన వ్యక్తం చేస్తూ వడ్వాట్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం మూడు గంటల మధ్యలో పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడు తూ.. వడ్వాట్ గేటు సమీపంలో ఉన్న వైష్ణవి రైస్ మిల్లు వద్ద మూడు రోజులుగా సుమారు 50మంది రైతులు సొంత, కిరాయి వాహనాలతో పడిగాపులు కాసిన వడ్లు కొనుగోలు చేసే సమయానికి మిల్లు క్వాంటిటీ అయిపోయిందని చెబుతున్నారని వాపోయారు. కొంతమంది రైతుల దగ్గర ప్రభుత్వానికి విరుద్ధంగా 3నుంచి 5కిలోల తరుగు తీసుకుంటున్నారని ఆరోపించారు.
ఓపక సీఎం, వ్యవసాయ శాఖ మంత్రులు రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొంటుందని గొప్ప లు చెప్పుకుంటున్నా.. ఇకడ రైస్‌మిల్లులో యజమానులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. రైస్‌మిల్ యజమానులకు ఆంక్షలు విధించడంతో ధాన్యం క్వాం టిటీ అయిపోగానే మళ్లీమళ్లీ రైతులు ధర్నాలు చేస్తే తప్పా ప్రభుత్వం ధాన్యం కొనలేని పరిస్థితికి జారిపోయిందని రైతులు మండిపడుతున్నారు. మిల్లర్లు మూడునుంచి ఐదు కిలోల తరుగు ఇస్తేనే వడ్లు కొంటామని లేకపోతే మిగతా రైతులు వేరే రైస్‌మిల్లుకు వెళ్లాలని చెబుతున్నట్లు పేర్కొన్నారు.
ధాన్యం అమ్ముకోవాలంటే రైతులు రోడ్డు ఎకాల్సిన పరిస్థితి నెలకొందని.. అధికారులు మిల్లుల వైపు కన్నె త్త్తి చూడకపోవడంతో మి ల్లర్లు, అధికారులపై రైతులు మండిపడుతున్నారు. గంటపాటు జాతీ య రహదారిపై రైతులు ధర్నా చేయడం తో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ప్రజలు నానా అవస్థలు పడ్డారు. విషయం తెలుసుకున్న తాసీల్దార్ సురేశ్‌కుమార్, ఏఎస్సై ఘటనా స్థలానికి చేరుకొని రైతులకు ఎంత నచ్చ చెప్పిన అధికారులు వచ్చి నామమాత్రంగా వారికి చెప్పడంతో ఆ పూ టకు ధాన్యం కొని మళ్లీ యథావిధిగా మిల్లర్లు క్వాంటిటీ అయిపోయిందని చెప్పి రైతుల ద్వారా తరుగు తీసి కొనుగోలు చేసుకుంటున్నారని తాసీల్దార్‌కు తెలిపారు.
అలా ఏం జరగకుండా నేను ముందుండి వడ్లు దింపిస్తానని రైతులతో మాట్లాడారు. అయినా రైతులు వినకుండా ధర్నాకు కూర్చున్నారు. ధాన్యం కొనేలా సంబంధిత అధికారులు చర్యలు సం ప్రదింపులు జరిపి వైష్ణవి రైస్ మిల్ యజమానితో ధాన్యం కొనేలా చర్యలు తీసుకోవాలని చెప్పడంతో అప్పటికప్పుడు ప్రస్తుతానికి 3000 బస్తాలు తీసుకోవాలని రైస్ మిల్ యజమానికి ఒప్పించడంతో రైతులు ధర్నా విరమించుకున్నారు. వివిధ గ్రామాల రైతులు భారీగా పాల్గొన్నారు.