దామరగిద్ద, ఏప్రిల్ 4 : మండలంలోని మల్రెడ్డిపల్లి గ్రామం లో నారాయణపేట- కొడంగల్ ఎ త్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న కానుకుర్తి ఎత్తిపోతల పథకం పనుల ప్రారంభాన్ని శనివారం వివిధ గ్రామాల రైతులు అడ్డుకున్నారు. రైతులు కథనం ప్రకారం మండంలోని మల్రెడ్డిపల్లి గ్రామంలో ఎత్తిపోతల పథ కం పనుల నిర్మాణానికి భూమిపూజ చేయడానికి వచ్చిన అధికారులను రైతులు అడ్డగించి పరిహారం చెల్లించాకే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కానుకుర్తి, మల్రెడ్డిపల్లి గ్రామ రైతులకు పూర్తి పరిహారం చెల్లించకుండా కేవలం సగం డబ్బులు ఇచ్చి పనులు మొదలు చేయవద్దని అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా నాయకులు వెంకట్రామ్రెడ్డి మాట్లాడుతూ భూములు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన సగం డబ్బులతో వేరే దగ్గర భూములు కొనడానికి అడ్వాన్ ఇచ్చి మిగతా డబ్బులకు రెం డు నెలలు సమయం తీసుకున్నామన్నారు. తీరా చూస్తే రెం డు నెలలు ముగిసినా కూడా డబ్బులు రాకపోవడంతో అ డ్వాన్స్ ఇచ్చిన డబ్బులు మునిగాయని భూమి అమ్మడానికి అడ్వాన్స్ తీసుకున్న వారు భూములు అమ్మడం లేదని దీనికి ఎవరూ బాధ్యత వహిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే భూములు కోల్పోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో అడ్వాన్స్ డబ్బులు మునిగితే ఎలా అని ప్రశ్నించా రు. మొత్తం ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు అన్ని డబ్బులు చెల్చించాకే పనులు మొదలు పెట్టాలని కానుకుర్తి సర్పంచ్ నారాయణ అధికారులను కోరారు.
దీనికి స్పందించిన అధికారులు మాట్లాడుతూ బుధవారం వరకు 300 ఎకరాల రైతులకు మొత్తం డబ్బులు చెల్లిస్తామని, మిగతా 400ఎకరాల డబ్బులు మరో 15 రో జుల సమయం కావాలని అడగటంతో కొందరు రైతులు సా నుకూలంగా స్పందించినా, కొందరు రైతులు మాత్రం మొ త్తం డబ్బులు ఇచ్చాకే పనులు ప్రారంభించాలన్నారు. అయి తే ప నులు మొదలు చేసినా ఫరవాలేదు ఒకవేళ 15రోజుల త ర్వాత డబ్బులు ఇవ్వకపోతే పనులను ఆపివేద్దామని అన్నట్లు సమాచారం. కార్యక్రమంలో సీఈవో సత్యతనారాయణరెడ్డి, తాసీల్దార్ తిరుపతయ్య, నారాయణపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు.