దామరగిద్ద, మే 5: దొడ్డు వడ్లు కొనాలని మండల రైతులు కాన్‌కుర్తిలో ట్రాక్టర్లతో ధర్నా, రాస్తారోకో చేశారు. దామరగిద్ద మండలానికి సంబంధించిన యాసంగిలో రైతులు పం డించిన వడ్లు ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేసిన ధా న్యాన్ని కోస్గి వద్ద ఉన్న వెంకటేశ్వర, ధనలక్ష్మి రైస్ మిల్లులకు పంపుతున్నారు. శనివారం నుంచి సదరు రైస్‌మిల్ వద్ద లిమి ట్ మించి పోయిందని ధాన్యం తీసుకోవడం నిలిపివేయడం తో రైతులకు ధాన్యం అమ్మే తిప్పలు తప్పలేదు.
క్యాతన్‌పల్లికి చెందిన సాయిరాం రైస్‌మిల్ వారు దొడ్డు వడ్లు అయినా తీసుకుంటాం కాని రైతులు తెచ్చిన వడ్లు వేసుకోవడానికి గోదాంలేదని, కాన్కుర్తి గోదాంలో అనుమతిస్తే వేసుకుంటామని చెప్పడంతో సోమవారం రైతులు యానగుంది వద్ద ఉన్న కాన్కుర్తి గోదాంకు ధానాన్యాన్ని వేయడానికి వెళ్లారు. అయితే అక్కడ దగ్గర్లో ఉన్న పత్తి మిల్లులో కాంటా పనిచేయకపోవడంతో రైతులు రాత్రి, పగలు ధాన్యాన్ని పెట్టుకుని రోడ్ల మీదనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో మళ్లీ కథ మొదటికే వచ్చింది. ఇలా విసిగివేసారిన రైతులు తమ ధాన్యం ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డంగా పెట్టి ధర్నాకు దిగారు.
అందులో అది యాద్గీర్, హైదరాబాద్ హైవే కావడంతో రెండు గంటల్లో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ఈ విషయంపై ఐకేపీ ఏపీఎం నర్సింహులును వివరణ కోర గా.. రైతుల దొడువ్డడ్ల గురించి మాట్లాడుతూ ఇప్పటి వరకు రైతులు తెచ్చిన సన్నవడ్లను కొన్నామన్నారు. దొడ్డువడ్లు ఎవ రు కొనడం లేదని, అయితే క్యాతన్‌పల్లి సాయిరాం రైస్‌మిల్లు వారు కొంటామని చెప్పారు. కానీ దగ్గర్లో ఉన్న ప్రైవేట్ కాంటా చెడిపోవడంతో రైతులకు ఇబ్బంది కలిగిందన్నారు. రెండురోజుల్లో రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. విషయం తెలుసుకున్న ఏఎస్సై అరుణ్‌కుమార్ పోలీసులు, డీఎస్వో బాలరాజు వెళ్లి దొడ్డవడ్లు కొనే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.