మక్తల్, ఏప్రిల్ 28: యాసంగిలో పండించిన వడ్లను అమ్ముకునేందుకు అన్నదాతలు తప్పని పరిస్థితుల్లో రోడ్డాక్కాల్సిన దుస్థితి నెలకొన్నది. ప్రభు త్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావాలంటే గన్నీబ్యాగులు లేక కల్లాలపైనే ధాన్యం అకాల వర్షాలకు తడుస్తున్నా.. అధికారులు గన్నీబ్యాగ్లు ఇవ్వకుండగా చోద్యం చూస్తున్నారని విసుగుచెంది సోమవారం మధ్యాహ్నం జాతీయ రహదారి పై భారీ ఎత్తున రాస్తారోకో చేపట్టారు. మక్తల్ మండలంలోని వివిధ గ్రామాల రైతులు గన్నీ బ్యాగుల కోసం సోమవారం ఉదయం మక్తల్ పీఏసీసీఎస్ రాగా.. కార్యాలయ సిబ్బంది రైతులకు గన్నీ బ్యాగులు ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడంతో అధికారుల తీరుకు నిరసనగా.. కార్యాలయం ఎదుటే జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. ప్రభుత్వం రైతుల పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతిగింజను కొంటామంటూ ఊకదుంపుడు మాట లు మాట్లాడి తీరా గన్నీ బ్యాగులను అందించకుం డా నిర్లక్ష్యం వహించడంతో ఆదివారం కురిసిన వర్షానికి భారీమొత్తంలో ధాన్యం తడిసి ముద్దయిందని వా పోయారు. అధికారులు రైతులకు తేదీలవారీగా టో కెన్లను జారీచేసి సంచులు ఇవ్వాల్సి ఉండగా.., ఇం దుకు విరుద్ధంగా పీఏసీసీఎస్ సిబ్బంది కాసులకు కకుర్తి పడి, అవసరమైన పెద్దపెద్ద రైతులకు రహస్యంగా గన్నీ బ్యాగులను తరలించడంతో మి గతా రైతులకు బ్యాగులు అందకుండా పోతున్నాయ ని ఆరోపించారు.
పెద్ద రైతులకు మాత్రమే గన్నీ బ్యా గులను ఇస్తుండడంతో కల్లాల్లో ఉన్న సన్నచిన్నకారు రైతుల ధాన్యం వర్షానికి తడిసి ముద్దవుతున్నా.. కొనుగోలు కేంద్రాల సిబ్బంది ఏమాత్రం చర్యలు చే పట్టకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని భీష్మించుకూర్చున్నారు. దీంతో జాతీయ రహదారిపై భారీ ఎత్తున ట్రాఫిక్ నిలిచిపోవడంతో మక్తల్ సీఐ రామలాల్ హుటాహుటిన సిబ్బందితో ధర్నా స్థలానికి చేరుకొన్నారు. రైతులను సమదాయించినప్పటికీ రైతులు ఏమాత్రం తగ్గకుండా.. గన్నీ బ్యాగులు వ చ్చేంతవరకు రాస్తారోకో విరమించేది లేదని పేర్కొన్నారు.
దీంతో సీఐ జిల్లా కేంద్రంలోని ఉన్నతాధికారులతో మాట్లాడి రైతులకు కావాల్సిన గన్నీ బ్యాగులను అందించే విధంగా చర్యలు చేపడుతామని అధికారులు హామీ ఇచ్చారని రైతులకు సూచించడం తో.. సీఐ హామీ మేరకు ధర్నా విరమించారు. మక్తల్ మండలంలో రైతులకు నాలుగున్నర లక్షల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా, కేవలం కార్యాలయం లో 25వేల గన్నీ బ్యాగులు మాత్రమే ఉన్నాయని, ఈ గన్నీ బ్యాగులను ఎవరికి ఇవ్వాలో అర్థంకాక కార్యాలయంలోనే ఉంచినట్లు సిబ్బంది తెలిపారు.