అయిజ, ఆగస్టు 19 : యూరియా కొరత రైతన్నకు చుక్కలు చూపిస్తున్నది. సాగు పనులు మానుకొని పొద్దస్తమానం ఎరువుల కోసం పడిగాపులు కాసినా యూరియా బస్తాలు దొరకడం గగనం అవుతుందని రైతులు ఆందోళనకు దిగారు. మంగళవారం అయిజ సింగిల్ విండో కార్యాలయంలో యూరియా కోసం మండలంలోని వివిధ గ్రామా ల నుంచి రైతులు భారీ ఎత్తున తరలొచ్చారు. ప్రతి రైతుకు రెండు బస్తాల చొప్పునా పంపిణీ చేస్తుండటంతో మహిళలు, వృద్ధులు చేరుకున్నారు. సొ సైటీ, ఫర్టిలైజర్ దుకాణాలకు యూరియా సరఫరా చేయడంలో జిల్లా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ కార్యాలయం ఆవరణలో రైతులు ఆందోళన చేయడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్న ది.
మూడు రోజుల నుంచి యూరియా కోసం పడిగాపులు కాసినా కేవలం ఒక లారీ యూరియాను పంపడంతో ఏమూలకు సరిపోతుందని రైతులు మండిపడ్డారు. నాట్ల వేళ పనులు మానుకొని, పస్తులు ఉంటూ యూరియా కోసం వానకు సైతం లెక్కచేయక క్యూలైన్లలో వేచి ఉన్నా ఫలితం లే కుండా పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. సర్కారు చేతగాని తనం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రైతులు ఆరోపించారు. కేసీఆర్ హయంలో యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత ఉండేదికాదని పేర్కొన్నారు. మునుపెన్నడూ లేని విధంగా రేవంత్‌రెడ్డి సర్కారు రైతులను అరిగోస పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వచ్చిన యూరియాను ఎలాగైనా పంపిణీ చేయాలనే ఉద్దేశ్యంతో పీఏసీసీఎస్ సిబ్బంది పోలీసుల పహారా మధ్య పంపిణీ ప్రారంభించారు.
అమరచింత, ఆగస్టు 19 : రైతులకు యూరియా అందించడం కూడా చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే గద్దె దిగాలని రైతులు డిమాండ్ చేశారు. సకాలంలో రైతులకు యూరియా, విత్తనాలు అందించలేదని ఈ సర్కారు ఉండి ఏమిటీ ప్రయోజనం అని వా రు ప్రశ్నించారు. మంగళవారం యూరియా కోసం ఆత్మకూర్ పీఏసీసీఎస్కు వచ్చిన రైతులు యూ రియా లేదని సిబ్బంది చెప్పడంతో ఒక్క సారిగా ఆగ్రహించిన రైతులు ఆత్మకూర్-మరికల్ ప్రధాన రహదారిపైకి వచ్చి ఆందోళన దిగారు. వర్షం పడుతున్నా లెక్కచేయగా రై తులు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత వారం రోజుల నుంచి జోరుగా వర్షం కురుస్తుందని యూరియా వేయకపోతే పంట చేతికి రాదని, ఇక్కడికి వస్తే అధికారులు అరకొరగా అందించి బడా రైతులకు రాత్రిరాత్రికే తరలిస్తున్నారని ఆరోపించారు. రైతుల ఆందోళన విషయం తె లుసుకున్న ఎస్సై నరేందర్ వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేయగా రైతులు మాట్లాడుతూ వరి పంట చేతికి రావాలంటే ప్రస్తుతం యూరియా చల్లాలని లేకపోతే పెట్టుబడి మీదపడి అప్పులు పెరిగి తమకు చావు తప్పా మ రో మార్గం లేదని తమ గోడు వినిపించారు. ఎస్సై వెం టనే పీఏసీసీఎస్ సీఈవో నరేశ్‌ను పిలిపించగా ఆయన మాట్లాడుతూ వరసగా ప్రభుత్వ సెలవు దినాలు రావడంతో యూ రియా ఇబ్బందులు తల్లెత్తాయని ఇక నుంచి ప్రతి రోజు సహకార సంఘానికి యూరియా సరఫరా కొనసాగుతుందని నచ్చ జేప్పెందుకు ప్రయత్నించినా రైతులు వినిపించుకోలేదు. దీంతో ఎస్సై నరేందర్ మండల వ్యవసాయాధికారి వినయ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడగా సాయంత్రం వరకు యూరియా వస్తుందని.. బుధవారం నుంచి పంపిణీ చేస్తామని చెప్పడంతో రైతుల శాంతించారు. రైతులకు వివిధ పార్టీల నాయకులు మద్దతు తెలిపారు.
రేవల్లి, ఆగస్టు 19 : యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. రేవల్లి పీఏసీసీఎస్, ఆగ్రోస్ సేవా కేంద్రాల చుట్టూ మూడ్రోజులుగా తిరుగుతున్నా దొరకడం లేదని వాపోతున్నారు. మంగళవారం విండో కార్యాలయం వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తే కేవలం ఒక బస్తా యూరియా దొరికిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఎరువులు, విత్తనాలకు ఇంత ఇబ్బంది పడలేదన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో వెనుకటి రోజులు మళ్లీ వచ్చాయని వాపోయారు.