గద్వాల, ఏప్రిల్ 24 : మల్లమ్మకుంట రిజర్వాయర్ చేపడితే తాము భూములు కో ల్పోయి నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని మల్లమ్మ కుంట రిజర్వాయర్‌ను ర ద్దు చేయాలని నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స భ్యుడు మల్లురవిని రైతులు వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎంపీ రైతుల లెటర్‌పై ఎన్లార్జ్ చేస్తూ రిజర్వాయర్ నిర్మాణం వల్ల రైతులు నిర్వాసితులుగా మారే అవకాశం ఉందని, రిజర్వాయర్ కోసం సేకరించిన భూ ములు అన్ని సాగు భూములని దీనిని రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని విచారణ చేసి నివేదిక అందించాలని ఎంపీ కలెక్టర్‌కు సూచించారు.
దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని ఇరిగేషన్ అధికారులకు కలెక్టర్ లెటర్ పంపగా దానిని ఈఈ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. చాలా కాలంగా ఆర్డీఎస్ రైతులు ఈ ప్రాజెక్టు ద్వారా పూర్తి స్థాయిలో పంట పొ లాలకు నీరు అందక ఇబ్బందులు పడుతుం టే రైతుల ఇబ్బందులను గ్రహించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్డీఎస్ రైతుల సమస్యలు పరిష్కరించి పూర్తి స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలనే ఆలోచనతో తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసింది. వాస్తవంగా ఆర్డీఎస్ ప్రాజెక్టు కింద 87,500 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉన్నా ఏనాడు ఇక్కడి రైతులకు అందలేదు.
అందుకు కారణం ఆర్డీఎస్ నీటిని అక్రమంగా కర్ణాటక రైతులు మోటర్ల ద్వారా తరలించుక పోతుంటే ఎవరూ పట్టించు కోలేదు. దీంతో కేవలం ఆర్డీఎస్ పరిధిలో రైతులకు 35వేల ఎకరాలకు మాత్రమే నీరు అందేది. మిగతా ఆయకట్టు అంతా బీడుగా ఉండేది. ఈ విషయం గ్రహించిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్డీఎస్ రైతులు ఎదుర్కొంటున్న సమస్యలకు పూర్తిస్థాయిలో పరిష్కారం చూపాలనే ఆలోచనతో బీఆర్ఎస్ ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ ఏర్పాటు చేసి కాల్వల ద్వారా చివరి ఆ యకట్టుకు నీరు అందించింది. అయితే అదేక్రమంలో తుంగభద్ర నదికి వరదలు వచ్చిన సమయంలో నీటిని తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా ఎత్తి పోసుకుంటే రైతులు సాగు చేసిన భూములకు ఎటువంటి ఇబ్బందులు ఉండవనే ఆలోచనతో అప్పటి ప్రభుత్వం తుమ్మిళ్ల లిఫ్ట్ కింద మూడు రిజర్వాయర్లను ప్రతిపాదించింది.
ఇందులో మల్లమ్మకుంట రిజర్వాయర్, జూలెకల్ రిజర్వాయర్, వల్లూరు దగ్గర ఒక రిజర్వాయర్ నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది. అయితే మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను మొదట పూర్తి చేయాలని 2017లో అనుమతు లు మంజూరు చేశారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయితే దీని పరిధిలో 55వేల ఎకరాలకు నీళ్లు అందుతాయని దీంతో ఆర్డీఎస్ రైతులు రెండు పంటలు పండించుకోవచ్చు అనే ఆలోచనతో ఈ రిజర్వాయర్‌ను రూ.500కోట్లతో పనులు పూర్తి అయ్యేలా అంచనాలు రూపొందించారు. ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం వడ్డేపల్లి మండలం తనగల గ్రామ పరిధిలో 567 ఎకరాల్లో నిర్మించాలని ప్రతిపాదించారు.
ఈ రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూమిలో 100 ఎకరాలు ప్రభుత్వ భూమి, 250 ఎకరాలకు పైగా దళిత సామాజిక వర్గానికి చెందిన భూములు, 217 ఎకరాలు ఇతరులకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీరికి పరిహారం అందించి పనులు ప్రారంభించాలనుకున్నారు. అయితే ఈ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తాము ఉపాధి కో ల్పోయే ప్రమాదం ఉందని ప్రస్తుతం రిజర్వాయర్‌కు సేకరించిన భూముల్లో వేరుశనగ, చెరుకు ప త్తి, మిరప, శనగ తదితర పంటలు సాగు చేస్తు వస్తున్నామని ఈ భూములు రిజర్వాయర్ కోసం తీసుకోవడం వల్ల తాము నిర్వాసితులమవుతామని తమ భూములు రిజర్వాయర్‌లో మునకకు గురైతే ఇక రిజర్వాయర్ ఎందుకని ఈ భూములు తీసుకుంటే వలసలే శరణ్యమని, దీంతోపాటు తమ పిల్లలు విద్యకు దూరమవుతారని దీనిని తాము తీవ్రంగా రైతులు వ్యతిరేకిస్తున్నట్లు నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు మల్లు రవికి రైతులు ఫిర్యాదు చేశారు.
గద్వాల కలెక్టర్ సంతోష్‌కు దీనిని రద్దు చేసే విధంగా ప్రభుత్వానికి పై కారణాలతో నివేదిక ఇవ్వాలని ఎంపీ కలెక్టర్‌కు రెఫర్ చేసిన లేఖలో పేర్కొన్న ట్లు తెలిసింది. కలెక్టర్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను(జీవో)ను బాధిత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని దీనిని రద్దు చేయాలని రైతులు ఎంపీ కోరగా పూర్తి స్థాయి నివేదిక అందజేయాలని కలెక్టర్‌కు లేఖ పంపంగా దీనిపై పూర్తి స్థాయిలో నివేదిక అందజేయాలని కలెక్టర్ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఇరిగేషన్ అధికారికి సూచించారు. ఎంపీ, కలెక్టర్ ఆదేశానుసారంగా బాధిత రైతులపై రిజర్వాయర్ ప్రభావాన్ని అంచనా వేయాలని, ప్రత్యామ్నాయాలను అన్వేషించడానికి గ్రామస్తులతో మాట్లాడాలని, దళితుల భూములను రక్షించడానికి ప్రాజెక్టు రద్దుకు సిఫారస్ చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు.
ఈ ఆందోళనలను హైలెట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఎంపీ లేఖలో ఆదేశించారు. ఈ విషయమై ఇరిగేషన్ అధికారులను వివరణ కోరగా మల్లమ్మకుంట రిజర్వాయర్‌ను రద్దు చేయాలని రైతులు ఎం పీని కోరారని, ఎంపీ క్షే త్రస్థాయిలో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించగా కలెక్టర్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల ఎటువం టి ఇబ్బందులు కలుగుతాయి, రైతులు ఎం దుకు దానిని వ్యతిరేకిస్తున్నారనే వివరాలు సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను కోరినట్లు కలెక్టర్ ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఈ రిజర్వాయర్ రైద్దెతే రైతుల ఆశలకు గండి పడడంతోపాటు ఆర్డీఎస్ రైతులు ఆం దోళన చెం దే అవకాశం ఉన్నది. భూ ములు కోల్పోయి న రైతులకు మార్కెట్ ధర ప్రకారం పరిహా రం చెల్లించాలి లేనిపక్షంలో రైతులకు భూమి బదులు భూమి ఇచ్చే విధంగా చర్య లు తీసుకోవాలని ఆర్డీఎస్ రైతులు కోరుతున్నారు.