గద్వాల, జూలై 16 : కాంగ్రెస్ పాలనలో అడుగడుగునా రైతన్నలు ఆందోళన పడుతున్నారు. ఇటు ప్రభుత్వ సహాయం అందక అటు అధికారులు పట్టించుకోకపోవడంతో రైతుల కష్టాల ఎవరికి చెప్పాలో తెలియని పరిస్థితి నెలకొన్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో వివిధ రకాల కంపెనీలకు సంబంధించిన ఈ ఏడాది వానకాలంలో సుమారు 50వేల ఎకరాల్లో సీడ్పత్తిని సాగు చేశారు. ఇప్పటి వరకు బాగానే ఉన్నా కంపెనీల దగ్గర నిల్వలు పేరుకుపోయాయనే సాకుతో రైతులు సా గు చేసిన సీడ్పత్తి పంటను తొలగించాలని, తొలగించకపోతే తమకు సంబంధం లేదని ఆర్గనైజర్లు రైతులపై ఒత్తిడి తెస్తూ వారికి ప్రతి ఏటా ఇచ్చే పెట్టుబడిని ఇవ్వకుండా ఇటు కంపెనీలు అటు ఆర్గనైజర్లు వేధిస్తున్నారు. రెండు నుంచి ఐదు ఎకరాలు సాగు చేసిన రైతులపై ఆర్గనైజర్లు, కంపెనీల ఒత్తిడి ఎక్కువగా ఉంది. కంపెనీ కేవలం ఎకరా సాగు చేసిన రైతుల పత్తి విత్తనాలు మాత్రమే కొనుగోళ్లు చేస్తాయని, మిగితా పంటకు సంబంధించి పత్తి విత్తనాలను కొనుగోలు చేయమని కరాకండిగా చెప్పడంతో రైతులకు ఏం చేయాలో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.
ఈ ఏడాది సీడ్పత్తి సాగు చేసిన రైతులకు ఆది నుంచి కంపెనీ లు, ఆర్గనైజర్లు కష్టాలు పెడుతూనే ఉన్నారు. గత ఏడాది పం ట సాగు చేసిన రైతుల విత్తనాలు తీసుకున్న కంపెనీలు రైతుల విత్తనాలు పాసైనప్పటికీ జీవోటీ పేరుతో విత్తనాలు ఫెయిల్ అయ్యాయని రైతులను ఇబ్బందులు గురిచేస్తూ వారికిచ్చే డ బ్బులను ఇవ్వకుండా వేధిస్తున్నారు. రైతులు పండించిన విత్తనాలను వేరే ల్యాబ్లో జీవోటీ టెస్టు చేస్తే పాస్ అని రావడం తో రైతులు కంపెనీలు ఆర్గనైజర్లుపై ఒత్తిడి తెచ్చారు. మా విత్తనాలు పాస్ అయినప్పటికీ ఫెయిల్ అయినట్లు చూపిస్తూ తమ ని మోసం చేస్తున్నారని రైతులు కంపెనీలు, ఆర్గనైజర్ల తీరును తప్పుపడుతున్నారు. ఈ విషయం రైతులు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డికు ఫిర్యాదు చేశా రు. అయినా రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు. కొం దరు నేతలు సీడ్పత్తి సీజన్ వచ్చినప్పుడు వారికి అండగా ఉం టున్నట్లు నటిస్తూ రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నా రు. వీరు ఏనాడు సీడ్పత్తి రైతుల కోసం నిజాయితీగా మద్ద తు తెలిపిన దాఖలాలు, పరిహారం ఇప్పించిన ఘటనలు లేవు.
సీజన్ ప్రారంభంలో సీడ్పత్తి విత్తనాలు ఇచ్చి పంట సాగు చేయమన్నారు. ఇప్పుడేమో పంట తొలగించమంటున్నారు. సీజన్ ప్రారంభమైన తరుణంలో రైతులను సీడ్పత్తి సాగు చేయమని ఆర్గనైజర్లుతో పాటు కంపెనీలు రైతులకు విత్తనాలు సరఫరా చేశాయి. రైతులు వివిధ కంపెనీలైన కావేరి, నూజివీ డు, కృషి, ధన్, వసంత, మైకో, పాలమూరు సీడ్స్, సాయి భ వ్య తదితర కంపెనీలకు చెందిన విత్తనాలను రైతులు 50 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రస్తుతం పంట వేసి 45 రోజులు అవుతున్నది. మరో 45 రోజులు అయితే పంట చేతికొచ్చే అవకాశం ఉన్నది.
ఈ తరుణంలో ఆర్గనైజర్లు ఒక ఎకరా మా త్రమే సాగు చేసిన రైతులకు సంబంధించిన విత్తనాలను మాత్రమే కంపెనీలు తీసుకుంటాయని, మిగితా ఎకరాల్లో సా గు చేసిన పంట విత్తనాలు తీసుకోరని , వేసిన పంటను తొలగించుకోవాలని కంపెనీలు, ఆర్గనైజర్లు సూచించడంతో విధిలేని పరిస్థితుల్లో రైతులు పంటను తొలగించుకుంటున్నారు. ఇప్పటి వరకు ఒక్కొక్క రైతు ఒక ఎకరాపై సుమారు రూ. 50 వేల వరకు పెట్టుబడి పెట్టారు. ఆ పెట్టుబడి అంతా ప్రస్తుతం బూడిదలో పోసిన పన్నీరు అయిందని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు.
రైతులకు కంటి తుడుపు చర్యగా ఎకరాకు రూ.15 వేలు పరిహారం ఇస్తామని చెబుతున్నారు. దీనిని రైతులు అంగీకరించడం లేదు. మాకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేనిపక్షంలో కంపెనీలు, ఆర్గనైజర్ల ఇంటి ముందు తమ కుటుంబాలతో నిరవధిక నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి రైతులకు న్యాయం జరిగే
విధంగా కృషి చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమను మోసం చేస్తున్న కంపెనీలు, ఆర్గనైజర్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్నిడిమాండ్ చేస్తున్నారు.