Rice Price | బియ్యం ధరలకూ రెక్కలు.. వారంలోనే క్వింటాకు రూ.800 పెరుగుదల
బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. వారంరోజుల్లోనే సన్న బియ్యం ధర రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉండగా.. ప్రస్తుతం ధర రూ.1200 వరకు పెరిగింది.
- ఉమ్మడి జిల్లాలో బియ్యం ధరలకు రెక్కలు
- వారంలోనే క్వింటాకు రూ.800 పెరుగుదల
- రూ.6,400 మార్క్‌కు చేరిన పాత బియ్యం
- హంస రకానిది అదే దారి..
బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. వారంరోజుల్లోనే సన్న బియ్యం ధర రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉండగా.. ప్రస్తుతం ధర రూ.1200 వరకు పెరిగింది. హంస బియ్యం ధరలు సైతం అదే క్రమంలో పెరిగాయి.
– కల్వకుర్తి, డిసెంబర్ 14
కల్వకుర్తి, డిసెంబర్ 14 రోజురోజుకు సన్నబియ్యం ధరలు పెరుగుతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల్లోనే క్వింటా సన్న బియ్యం ధర రూ.800 వరకు పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో సన్నబియ్యం సోనమసూరి, బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాలకు చెందిన పాత య్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా, కొత్త బియ్యం క్వింటా రూ.5,400 వరకు ధర చేరింది. గతేడాది నవంబర్, డిసెంబర్లో రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉన్న పాత బియ్యం, ప్రస్తుతం రూ.1200లకు పెరిగింది. హంస బియ్యం ధరలు కూడా గణనీయంగా పెరిగాయి. పాత హంస బియ్యం ధర దాదాపు రూ.4వేల వరకు ఉంది.
సన్నవడ్ల ధర పెరగడంతో..
సన్న వడ్ల ధర పెరగడంతో కొందరు రైతులు తాము పండించిన సన్న వడ్లను నేరుగా మిల్లుకు తరలించి బియ్యంగా మార్చుకుంటున్నారు. బియ్యం ధర అధికంగా పెరుగుతుండటంతో సదరు బియ్యాన్ని తర్వాత నేరుగా విక్రయించుకుంటే మరింత లాభం వస్తుందని రైతులు భావిస్తున్నారు. పెట్టుబడి ఖర్చుల నిమిత్తం తాము పండించిన సన్న వడ్లను కొంత భాగం అమ్ముకొని, మరికొంత భాగాన్ని బియ్యంగా మార్చుకుంటున్నారు. బి య్యం రెండు మూడు నెలలు ఉంచితే పా తగా మారుతాయి. అదనంగా క్వింటాకు రూ.వెయ్యి వరకు మిగులుతాయని రైతు ల అంటున్నారు.ధరల పెరుగుదలకు రెం డు కారణాలున్నాయని బియ్యం వ్యా పారులు చెబుతున్నారు. బియ్యాన్ని బ యటి రాష్ర్టాలకు ఎగుమతి చేయ డం, రెండోవది మిగ్జాం తుఫాను దాటికి తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో వరి దెబ్బతినడమని వ్యాపారులు అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగాయి..
అంతర్జాతీయ మార్కెట్లోనే బియ్యం ధరలు పెరుగుతున్నాయి. బియ్యం ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో కరువు తదితర పరిస్థితుల వల్ల ఎక్కువ డిమాండ్ ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులకు 20శాతం పన్ను విధిస్తున్నా ఎగుమతులు ఆడగం లేదు. దీనికి తోడు మిగ్జాం తుపాన్ ప్రభావం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. దీంతో బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
– జూలూరి రమేశ్‌బాబు, రైస్‌మిల్లర్ల అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

