వనపర్తి, ఫిబ్రవరి 15(నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఓ గ్రామంలో ఎకరా 27గుంటల భూమిలో 34మంది రైతులున్నారు. ప్రభుత్వం నూతనంగా చేయాలంటున్న డీసీఎస్ సర్వేలో దాదాపు పదిలోపు ఆప్షన్లున్నాయి. ఈ 34మంది రైతులను ప్రత్యేకంగా ఫొటో తీయాలి. పంట సాగును గుర్తించాలి. వరి అ యితే ఎరకం, సాగునీటి వనరు, నాటు పద్ధతి ఎలా వేశారు వంటి సుమారు ఓ పది వరకు ఆప్షన్లు ఒక్కరైతు నుంచి సేకరించాలి. పైన కనబర్చినట్లుగా ఒ క్కో రైతుకు ఆరగంటకు పైగా సమయం పడుతుంది. సర్వేనెంబర్ ప్రకారం పొలంలో కాలు పెడితేనే స ర్వర్ ఓపెన్ అవుతుంది. రెండు మీటర్ల దూరంలో ఉన్నా యాప్ ఓపెన్ కాదు. ఇలా అనేక సమస్యల మధ్య డిజిటల్ క్రాప్ సర్వే కొనసాగుతుంది. జిల్లాలోని సాగు భూములను డీసీఎస్ ద్వారా గుర్తించి న మోదు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం గతేడాది స ర్వేకు శ్రీకారం చుట్టింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనంతరం ఇప్పటి వరకు రైతుబంధు ఊసేలేదు. ఇ టీవలే ఒకటి, రెండు ఎకరాలకు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే, అది సంపూర్ణంగా సాగుతుందన్న పరిస్థితులు కనిపించడం లేదు. వేశామని ప్రభుత్వం చెబుతున్నా.. పోన్లకు మెసేజ్‌లు వచ్చి నా తీరా బ్యాంకులకు వెళ్లి చూస్తే.. డబ్బులు పడడంలేదని అనేక మంది రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వినతిపత్రంతో సమస్యల మొర..
జిల్లా వ్యవసాయ కార్యాలయంలో శనివారం ఏఈవోలు డిజిటల్ క్రాప్ సర్వేలో ఉన్న సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని టెక్నికల్ ఇన్చార్జి వెంకటేశ్‌కు ఇచ్చి మొర పెట్టుకున్నారు. క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయని, సర్వర్ పనిచేయకపోవడం, రైతులు సహకరించకపోవడం, పొలాలకు వెళ్లినప్పుడు జనసంచారం లేకపోవడం, ఐదారేండ్ల కిందట ఇచ్చిన ట్యాబ్‌లు పనిచేయకపోవడంలాంటి వాటితో ఏవో లు సర్వే చేయడం కష్టమని తేల్చారు. తమకు కనీ సం ఒక సహాయకుడిని ఇచ్చినా సర్వే చేయగలుగుతామని తమనొక్కరినే చేసుకురావాలంటే ఫీల్డ్‌లో చాలా ఇబ్బందులున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్ల్లో జిల్లాలో సర్వే కనీసం 25 శాతం కూడా చేపట్టలేదు. పొలాలకు ఏఈవోలు వెళ్లినప్పుడల్లా రైతుభరోసాను ఎత్తివేయడానికే ఇదం తా అన్నట్లు రైతులు గుర్రుగా ఉండడంతో ఏఈవో లు నిస్సాహాయులుగా మిగులుతున్నారు.
బాటలు లేని పొలాలు..
డిజిటల్ సర్వే చేయాలన్నా.. వ్యవసాయ పొలాలకు మార్గాలు సక్రమంగా ఉండవు. మరీ వరిపొలాల గట్లపై వెళ్లి సర్వే చేయాలంటే చాలాకష్టం. అం దులో మహిళలకైతే నరకమే. సన్నటి ఒరాలు, నడవడానికి వీలులేకుండా ఉండే పరిస్థితిలో బురదను కొట్టుకోవడం తప్పా మరేం ఉండదు. ఇంకా బాలింతలు, గర్భిణులైతే అసలే కష్టం. గతంలోనే ఈ స ర్వేపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయినా కచ్చితంగా చేయాలని అధికారులు ఒత్తిడి చేసినప్పటికీ అంతంతమాత్రమే సాగింది. ప్రస్తుతం జిల్లాలోనూ సర్వేకు గడ్డు పరిస్థితులే ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు కనీసం 25శాతం కూడా సర్వే పూర్తి కాలేదంటే క్షేత్ర స్థా యిలో ఉన్న సమస్యలే కారణమని ఏఈవోలు చెబుతున్నారు. పొలాలకు వెళ్లి ఫోన్లు చేసినా రైతులు స్పందించక పోవడంతో సమస్యల సుడిగుండంలో సర్వే అన్నట్లు తయారైంది. గతంలోనూ ఇలాంటి సర్వేలను ప్రైవేట్ ఏజెన్సీలతో చేయించినప్పటికీ ఏడాది నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏఈవోలకు ఈ సర్వే పనిని అంటగట్టింది. అంతకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుబంధు 12 పర్యాయాలు వేసినా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు ఆర్థికసాయం అందుకున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎలాంటి సాయం అందకపోయినా సర్వేల పేరుతో కాలయాపన తప్పా మరొకటి లేదంటున్నారు రైతులు.
మహిళా ఏఈవోలు 32 మంది..
జిల్లాలో మొత్తం 72మంది ఏఈవోలు పని చేస్తున్నారు. వీరిలో దాదాపు 32మంది మహిళా ఏఈవోలు కొనసాగుతున్నారు. అయితే, కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన డీసీఎస్ వీరికి ఇక్కట్లను తెచ్చిపెట్టింది. ఇలా మహిళా ఏఈవోలు ఒంటరిగా వెళ్లాలన్నా.. వరిచేల గట్లపై పోవాలన్నా.. బాటలులేని పొలాలకు చేరుకోవాలన్నా చాలాకష్టం. తీరా అక్కడికి వెళ్లాక సర్వర్ డౌన్ అంటే ఇక అంతే సంగతులు. అష్టకష్టాలు పడి పొలం దగ్గరకు చేరుకున్నా.. యాప్ సహకరించకపోతే ఆరోజు ఖతం అయినట్లే. మోటర్ సైకిల్‌పై గ్రామానికి చేరుకున్నా.. కచ్చితంగా ప్రతి సర్వేనెంబర్ పొలంలోకి కాలు పెడితేనే యాప్ ఓపెన్ అవుతుంది. ఈ క్రమంలో ఏఈవోలు తమకు సర్వే చేయడం కష్టంగా మారిందంటూ ఆరోపిస్తున్నారు.