కోడేరు ఫిబ్రవరి 9 : యూరియా కో సం రైతులకు తిప్పలు తప్పడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా కోసం యాప్‌లో నమోదు చేసుకోవాలని నిబంధన పెట్టడంతో చదువురాని రైతులు, పేద రైతులు ఇబ్బందులు పడుతున్నా రు. యూరియా యాప్ కోసం ఓరైతు అప్పు చేసి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొనడంతో ఆరైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని నాగులపల్లి గ్రామానికి చెందిన రైతు దాసరాజులు బిచ్చయ్యకు నాగులపల్లి గ్రామ శివారులో 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. అందులో 7ఎకరాల్లో ఈయాసంగిలో వరి పం టను సాగు చేశాడు.
మిగిలిన మూడెకరాలలో మామిడితోటు సాగు చేశాడు. అయితే వరి పంట కోసం యూరియా అవసరం ఉండగా ప్రభుత్వం యాప్ ద్వారా బుకింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. అయితే సోమవారం ఉద యం కొండ్రావుపల్లి పీఏసీసీఐ కార్యాలయంలో యూరియా తీసుకునేందుకు బిచ్చయ్య వెళ్లాడు. అక్కడ స్మార్ట్‌ఫోన్‌ల్లో యాప్ ద్వారా యూరియాను బుకింగ్ చేస్తున్నారు. తనది చిన్న ఫోన్ కావడంతో బుక్ చేయడానికి అవకాశం లేదని అక్కడి సిబ్బంది వివరించారు. దీంతో చేసేదేమి లేకపోవడంతో వెనుదిరిగి వచ్చిన బిచ్చయ్య రూ.14వేలు అప్పు చేసి కొత్త ఫోన్ కొనుగోలు చేశాడు.
ఈవిషయమై సదరు రైతు దాసరాజుల బిచ్చయ్యను నమస్తే తెలంగాణ పలుకరించగా గతంలో యూరియా కావాలంటే అవసరం ఉన్న రైతు లు పట్టాదారు పాస్ బుక్కు, ఆధార్‌కార్డు జిరాక్స్ ఇస్తే ఇచ్చే వారని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంతోకి వచ్చాక కొత్త నిబంధనలు పెట్టి యాప్‌లో యూరియా బుకింగ్ చేసుకోవాలంటే మాలాంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఆన్నైల్ విధానం వల్ల రైతులకు తీవ్ర నష్టం జరుగుతున్నదని గతంలో నవంబర్, డిసెంబర్లోనే యూరియా ఇచ్చే వారు ఇప్పు డు ఆన్లైన్ విధానం పెట్టడం వల్ల తనలాగా చదువు రాని రైతులు పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి యాప్‌తో సం బంధం లేకుండానే రైతులకు యారియా అందజేయాలని కోరారు.