నారాయణపేట : జిల్లాలోని పగిడిమర్రి గ్రామానికి చెందిన రైతు ఒకరు విద్యుదాఘాతానికి (Electrocution) గురై మృతి చెందాడు. తిప్రాస్‌పల్లి శివారులో ఉన్న వేరు శనగ పంటకు నీళ్లు పెట్టేందుకు వెళ్లిన మద్దుమ్ అలీ (54) అడవి పందులు రాకుండా పెట్టిన ఎలక్ట్రిక్ ఫెన్సింగ్‌కు తగిలి ప్రమాదవశాత్తు గురై మరణించాడు.
భార్య షాహిదా బేగం భర్తకు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో అనుమానంతో బంధువులతో కలిసి పంట చేనుకు వెళ్లి పరిశీలించగా చేనులో అచేతనంగా పడి ఉండడాన్ని గమనించారు. వెంటనే నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు మృతి చెందాడని దృవీకరించారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.