నాగర్‌కర్నూల్, నవంబర్ 20 : అన్నదమ్ము ల మధ్య భూ పంచాయితీ విషయంలో మధ్యవర్తుల జోక్యాన్ని జీర్ణించుకోలేని ఓ రైతు నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గురువారం చోటుచేసుకున్నది. ఇందుకు సంబంధించి బాధితుడు శంకర్‌గౌడ్ భార్య సుజాత తెలిపిన కథనం మే రకు వివరాలిలా ఉన్నాయి. బిజినేపల్లి మం డలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన శంకర్‌గౌడ్ అనే రైతుకు వారసత్వంగా ఎకరం 20 గుంటల భూ మి రాగా, 10 గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అనంతరం ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా 6 గుంటల భూమిని అమ్మేందుకు పూనుకున్నాడు.
ఈ విషయం తెలిసిన శంకర్‌గౌడ్ అన్న భూపతిగౌడ్, అన్న భార్య పా ర్వతమ్మ, అన్న బావమరిది బాలగౌడ్లు అడ్డుకుంటున్నారని పేర్కొంది. అన్న బావమరిది అ యిన బాలగౌడ్ ఎమ్మెల్యే చేత తాసీల్దార్‌కు ఫోన్ చేయించి భూమి అమ్మకుండా చేస్తున్నారని, స్లాట్ బుక్ చేసుకున్నా భూమిని అమ్ముకోకుండా ఎమ్మెల్యే, వారి అనుచరుల జోక్యం తో ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ వి షయమై నేరుగా ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు కుటుంబ సభ్యులతో శంకర్‌గౌడ్ గురువారం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నాడు. అక్కడున్న కార్యకర్తలతో తనకు జరిగిన అన్యాయం చెబుతూనే మనస్తాపానికి గురైన శంకర్‌గౌడ్ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగాడు. దీంతో వెంటనే అతన్ని 108లో జిల్లా దవాఖానకు తరలించారు. కాగా ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి దవాఖానకు చేరుకొని చికిత్స పొందుతున్న శంకర్‌గౌడ్‌ను పరామర్శించారు. జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు.