ఊటూర్, సెప్టెంబర్ 12 : ప్రభుత్వ బడుల్లో విద్యార్థులను వసతులు వెక్కిరిస్తున్నాయి. కొద్ది రోజులుగా ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు పాఠశాలల్లోకి వరద నీరు చేరి ప్రాంగణాలు మురికి గుంటలను తలపిస్తున్నాయి. దీంతో చాలా చో ట్ల విద్యార్థులు పాఠశాల ప్రాంగణాల్లో నిలబడి ప్రార్థన చేసేందుకు అవస్థలు పడుతున్నారు.
ఊట్కూర్ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలోకి వర్షం నీరు చేరడంతో కొద్ది రోజులుగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే క్రమంలో గురువారం స్థానికంగా ఉంటున్న ఓ కాంట్రాక్టర్ సహకారంతో ట్రాక్టర్ మొర్రం మట్టిని వేయించగా హెచ్ఎం కుసుమ ఆధ్వర్యంలో విద్యార్థులు, సిబ్బంది స్వయంగా మట్టిని మోసి పాఠశాల ప్రాంగణాన్ని చదును చేసుకున్నారు.
కాగా, మట్టిని మోస్తున్న ఫొ టో, వీడియో దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ చేయగా.. విద్యావ్యవస్థ భ్రష్టు పట్టిందని, ప్రభుత్వం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యత ఇదేనా అంటూ నెటిజన్లు ప్రశ్నించారు. హెచ్ఎంను వివరణ కోరగా.. పాఠశాల ప్రాంగణం బురదగా ఉండడంతో దాత సహకారంతో మట్టిని తెప్పించామని, జీపీ కార్మికులు సగం వేసి వెళ్లిపోవడంతో శుక్రవారం ప్రార్థన సమయానికి ఆ టంకం లేకుండా మధ్యా హ్నం అందరం కలిసి శ్రమదానం చేశా మన్నారు.