మహబూబ్‌నగర్, డిసెంబర్ 24 : అందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఎక్సై జ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో మంత్రి క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్ క్రిస్టియన్‌పల్లికి చెందిన ఎం.శోభారాణికి సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.2.50 లక్షల ఎల్వోసీ చెక్కును అందజేశా రు. అనంతరం మహబూబ్‌నగర్ పట్టణానికి చెందిన రాజశేఖర్‌రెడ్డి, అబేదాబేగం ని మ్స్ దవాఖానలో చికిత్స పొందుతుండగా.., వారిని పరామర్శించారు. అలాగే ఆరెకటిక సంఘం నేతలు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
సమస్యలపై మంత్రి వెంటనే స్పందించి గండీడ్ తాసిల్దార్ జ్యోతికి ఫోన్లో మాట్లాడారు. ఆరెకటికలకు వెయ్యి గజాల ప్రభుత్వ భూమిని కేటాయించాలన్నారు. కార్పొరేషన్ అధికారి రాంచందర్‌కు ఫోన్ చేసి ఆరెకటికలకు ఇబ్బందుల్లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేశ్, కౌన్సిలర్ అనంతరెడ్డి, ఆరెకటిక సంఘం నాయకులు ప్రభాకర్, వినయ్‌కుమార్, నాగరాజు, రామచంద్ర తదితరులున్నారు.