Marri Janardhan Reddy | తిమ్మాజిపేట, జూన్ 1 : తిమ్మాజీపేట మండలం కుమ్మకొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ కుమారుడిని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల గుమ్మకొండ గ్రామ సమీపంలో బైక్పై నుంచి పడి తీవ్రంగా గాయపడ్డ సాయి హైదరాబాద్లోని యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో సాయిని మర్రి జనార్ధర్ రెడ్డి పరామర్శించారు. ప్రస్తుతం ఆయనకు అందుతున్న చికిత్సను డాక్టర్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అండగా ఉంటామని ధైర్యంగా ఉండాలని మాజీ సర్పంచ్ ఓదార్చారు. ఆయన వెంట మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ ఎంపీపీ రవినాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ వేణుగోపాల్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ యాదవ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఉసేని, నాయకులు వెంకటేష్ నరేందర్ రెడ్డి, అయూబ్ ఖాన్ తదితరులు ఉన్నారు.