Maktal | మక్తల్, మార్చి 21 : తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీట వేసి మైనార్టీల అభివృద్ధికి పాటుపడింది కేసీఆర్ సర్కారేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో భాగంగా శుక్రవారం మక్తల్ భారత రాష్ట్ర సమితి నాయకులు మాజీ మున్సిపల్ కమిషనర్ ఇర్ఫాన అన్వర్ హుస్సేన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి హాజరై, షరీఫ్ ఆ మసీదులో ముస్లిం మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ముస్లిం సోదరులకు పండ్లు తినిపించి రోజా విడిపించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మైనార్టీ సంక్షేమానికి పెద్దపీటవేయాలని సంకల్పంతో, కెసిఆర్ ప్రభుత్వ హాయంలో మైనార్టీలకు ప్రత్యేకమైన చొరవ చూపడం జరిగిందన్నారు. రాష్ట్రంలో సంపన్న కులాలకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని లక్ష్యంతోనే కేసీఆర్ ముస్లిం సంక్షేమానికి పెద్దపీట వేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే ముస్లిం మత పెద్దలకు సూచించారు.
ప్రతి ఒక్క కుటుంబం బాగుండాలని లక్ష్యంతో కేసీఆర్ 10 ఏళ్లపాటు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా షాదీ ముబారక్ పథకాన్ని తీసుకువచ్చి పేరేంటి మైనార్టీ ఆడబిడ్డ పెళ్లికి పెద్ద షాదీ ముబారక్ పేరుతో లక్ష 116 రూపాయల బహుమానాన్ని కేసీఆర్ ప్రభుత్వం అందించిందని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు తప్ప, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన హామీల ప్రకారం ఒక్క పథకాన్ని కూడా నేటి వరకు అందించలేక పోయిందని హెద్దేవా చేశారు. ఎల్లప్పుడూ ముస్లిం అభివృద్ధి కోసం భారత రాష్ట్ర సమితి నిరంతరంగా పోరాడుతుందని మాజీ ఎమ్మెల్యే సూచించారు
కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి నాయకులు, శ్రీనివాస్ గుప్తా, రాజుల ఆశి రెడ్డి, చిన్న హనుమంతు, అన్వర్ హుస్సేన్, మైముద్, మన్నాన్, సాదిక్, రాజు, ఈశ్వర్ యాదవ్, రాజు, సాగర్, ముస్లిం కులస్తులు తదితరులు ఉన్నారు.