Niranjan Reddy | పెద్దమందడి, మార్చి16 : వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అల్వాల గ్రామానికి చెందిన ఎరుకలి భీమయ్య ఇటీవల ప్రమాదవశాత్తు గుండెపోటుతో మృతి చెందగా ఇట్టి విషయాన్ని గ్రామ బీఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఆదేశాల మేరకు గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆదివారం రూ. 6 వేల ఆర్థిక సహాయం మృతుని కుటుంబానికి అందజేశారు. నిరంజన్ రెడ్డి త్వరలోనే ఆ కుటుంబ సభ్యులను కలిసి మనోధైర్యాన్ని కల్పిస్తారని వారు అన్నారు. ఆ కుటుంబాన్ని ధైర్యంగా ఉండాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోమాజీ ఉప సర్పంచ్ వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, బాల్ రెడ్డి, బాలకృష్ణ, శ్రీనివాస్ యాదవ్, సునీల్ కుమార్ రెడ్డి, ఎరుకల రాములు, తిమ్మారెడ్డి పాల్గొన్నారు.