నర్వ, నవంబర్ 1 : సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని, నాడు కరువు కాటకాలతో అల్లాడిన ప్రాంతం నేడు పచ్చబడిందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని కుమార్లింగంపల్లి, రాంపూర్ గ్రా మాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లోని ఆలయాల్లో పూ జలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరువు కాటకాలతో అల్లాడిన రాష్ట్రంలో, బీడు భూములు మాత్రమే కనిపించే పొలాలు నేడు పచ్చదనంతో కళకళలాడుతున్నాయన్నారు. రైతుల పక్షపతిగా సీఎం కేసీఆర్ ఎన్నో రకాల పథకాలు ప్రవేశపెట్టారన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వే స్తూ గతంలో లేని విధంగా ప్రభుత్వ దవఖానల్లో కార్పొరేట్ వైద్యం అందుతుందన్నారు. ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశామన్నారు. పుట్టబోయే పిల్లల నుంచి పండు ముదుసలి వరకు అండదండగా నిలుస్తున్న బీఆర్ఎస్కు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రతిపక్ష నేతల కల్లబొల్లి మాటలు విని మోసపోవద్దని, సంక్షేమాన్ని చూసి కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ జ యరాములుశెట్టి, సర్పంచులు అరవింద్‌రెడ్డి, శివ, ఎంపీటీసీ పద్మ, పార్టీ మండలాధ్యక్షుడు మహేశ్వర్‌రెడ్డి, నాయకులు అయ్య న్న, శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్, కిరణ్ప్రకాశ్రెడ్డి, హన్మంత్‌రెడ్డి, చిన్నయ్య పాల్గొన్నారు.
ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డికి నామినేషన్ ఖర్చుల కోసం రాంపూర్ గ్రామానికి చెందిన వికలాంగ బాలుడు కృష్ణవంశీ ఒక నెల పింఛన్ డబ్బులను రూ.4016ను ఎమ్మెల్యేకు అందజేశారు. పౌష్టికాహారలోపంతో బాధపడుతున్న బాలుడికి ఎమ్మెల్యే ధైర్యం ఇచ్చారు. వైద్యం పరంగా తమ వంతు సహకారం అందిస్తానన్నారు.