దేవరకద్ర, జనవరి 21 : ఓటరు జాబితలో తప్పులు లేకుండా చూడాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రవినాయక్ బీఎల్వోలకు సూ చించారు. ఆదివారం మండలంలోని చౌదర్‌పల్లిలోని పోలింగ్ కేంద్రాన్ని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఓటర్ల జాబితా వివరాలు బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఓటరు జాబితలో మృతి చెందిన వారి పేర్లు తొలగించాలన్నారు. ఓటర్లు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఆదివా రం, సోమవారం ప్రత్యేక ఓటరు నమోదు కా ర్యక్రమం సందర్భంగా గ్రామాల్లో 18 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకునే విధంగా చూ డాలన్నారు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాసులు, డీటీలు శివరాజ్, అబ్దుల్ రహమాన్, ఆర్ఐ సురేశ్, సంతోష్, బీఎల్వో పాల్గొన్నారు.
బాలానగర్, జనవరి 21 : తప్పుల్లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా అదనపు కలెక్టర్ మోహన్‌రావు బీఎల్వోలను ఆదేశించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో రెండు రోజులపా టు నిర్వహిస్తున్న స్పెషల్ కాంపెయిన్‌ను ఆదివారం తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ కొత్త ఓటరు నమోదుతోపాటు చేర్పులు, మార్పుల కోసం వచ్చే ఓటర్లకు సహకరించాలన్నారు. అంతకుముందు ఓటరు నమోదు, సవరణ చేసుకునే పద్ధతిపై అవగాహన కల్పించా రు. కార్యక్రమంలో తాసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్ఐ వెంకట్‌రెడ్డి, బీఎల్వోలు కమల, జరీనాబేగం పాల్గొన్నారు.
నారాయణపేట, జనవరి 21 : ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్బందీగా రూపొందించాలని నారాయణపే ట కలెక్టర్ శ్రీహర్ష అన్నారు. ఆదివారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ప్ర భుత్వ అభ్యాసన ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు సహాయ కేంద్రాలను ఆయన తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓటరు జాబితాలో చనిపోయిన వారి పేర్లను మరణ ధ్రువీకరణ పత్రం ఆధారం గా తొలగించాలన్నారు. ఓటర్ల ఫొటోలు సరిగా లేకపోతే కొత్త ఫొటోలు తెప్పించుకొని సరిచేయాలన్నారు. తొలగించిన డబుల్ ఓటర్లు, చనిపోయిన వారి జాబితాను తయారు చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో రాంచందర్, తాసీల్దార్ రాణాప్రతాప్‌సింగ్ ఉన్నారు.
ఊట్కూర్, జనవరి 21 : ఓటరు జాబితాను తప్పులు లేకుండా రూపొందించాలని నారాయణపేట అదనపు కలెక్టర్ మయాంక్ మిట్టల్ అన్నారు. ఆదివారం ఊట్కూర్, ఓబ్లాపూర్, పగిడిమర్రి, అమీన్పూర్ గ్రామాల్లో చేపట్టిన ప్ర త్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. అభ్యంతరాలు, సవరణల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. కార్యక్రమంలో తాసీల్దార్ శివశ్రీనివాస్, సర్పంచ్ సూర్యప్రకాశ్‌రెడ్డి, ఆర్ఐ శ్రావణ్, బీఎల్వోలు పాల్గొన్నారు.