తిమ్మాజిపేట : ప్రభుత్వ పాఠశాలలోనే ( Government Schools ) విద్యార్థులను చేర్పించాలని ( Enroll students ) మండల విద్యాధికారి సత్యనారాయణ శెట్టి ( MEO ) విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తిమ్మాజీపేట (Timmajipet) మండల కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని పాఠశాల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్‌తో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలలోనే నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు.
విద్యావంతులైన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారని, తెలుగుతోపాటు ఇంగ్లిష్ మీడియంలో కూడా బోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు,, యూనిఫామ్, మధ్యాహ్న భోజనం అందిస్తుందని వెల్లడించారు. అన్ని రకాల మౌలిక వసతులు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాయని, వేల రూపాయలు ఖర్చు చేసి ప్రైవేట్ కు పంపి నష్టపోవద్దని ప్రభుత్వ పాఠశాలలోనే పిల్లలను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎంలు జైపాల్ రెడ్డి, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.
Also Read :
షాద్‌నగర్‌లో మక్తల్ ఎమ్మెల్యే వాహనానికి ప్రమాదం..
ఆగిఉన్న లారీని ఢీకొట్టిన కారు.. తల్లీ కూతురు దుర్మరణం