MLA Vakiti Srihari | మహబూబ్నగర్ : మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుండి మహబూబ్ నగర్ వైపు వెళ్తున్న టీజీ 38 6669 నెంబర్ గల ఇన్నోవా కారును పక్కన నుండి వస్తున్న ఐ 20 కారు వేగంగా ఢీకొట్టింది. షాద్నగర్ రాయికల్ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన జరిగింది. ప్రమాదంలో ఎమ్మెల్యే కారుకు స్వల్పంగా ధ్వంసం కాగా ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఎమ్మెల్యేకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో పోలీసులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.