కదం తొక్కిన ఉద్యోగులు
ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు.
- నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఆందోళనలు
- హామీలు అమలు చేయాలని డిమాండ్
నెట్వర్క్ మహబూబ్‌నగర్, ఏప్రిల్ 17 : ఉద్యోగులు కదం తొక్కారు. నిరసన ప్రదర్శనలు, నినాదాలతో ప్రభుత్వ కార్యాలయాలన్నీ దద్దరిల్లాయి. శుక్రవారం ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా పీఆర్సీతోపాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ల వద్ద, పట్టణ, మండల కేంద్రాల్లోని ఆర్డీవో, తాసీల్దార్ కార్యాలయాల ఎదుట నిరసన చేపట్టారు. నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు భోజన విరామ సమయంలో అసహనం ప్రదర్శించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ప్రజాపాలనలో ‘హామీలు అమలు అయ్యేదెప్పుడు-ఉద్యోగుల కష్టాలు తీరేదెప్పుడు’ అన్న ఫ్లెక్సీలను ప్రదర్శించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతులు అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ 2వ పీఆర్సీని 51 శాతం ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయడంతోపాటు ఉద్యోగులకు వెంటనే హెల్త్ స్కీమ్‌ను అమలు చేయాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని నినాదించారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

