దోమలపెంట, మే 29 : శ్రీశైలం విద్యుత్ కేంద్రంలోని ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకించారు. తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఈగలపెంట శ్రీశైలం ఎడమ గట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రం వద్ద ఉన్న సర్కిల్ కా ర్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర పవర్ ఎంప్లాయీస్ జేఏసీ కో- చైర్మన్ చరణ్ మాట్లాడారు.
విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరిస్తే ఆ యా సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఉద్య గ భద్రత ఉండదని ఆవేదన చెందారు. అలాగే పేదలకు ఇస్తున్న విద్యుత్ క్రాస్ సబ్సిడీలు ఎత్తేసే అవకాశం ఉన్నదని ఆరోపించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులందరూ ఐక్యంగా ఉద్య మం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నాయకులు రామ్మోహన్, 327 యూనియన్ అశోక్, 11 04 యూనియన్ వంశీ, సునీల్, ఇంజినీర్లు సందీప్‌రెడ్డి, శివదీప్, నరేశ్, నాను, ఊస్సేనప్ప, వెంకట్‌రెడ్డి, విజయ, చంద్రిక, ప్రభావతి, ఉమాశెట్టి, ప్రగతి, తిరుపతమ్మ, రాధిక పాల్గొన్నారు.