కొల్లాపూర్ రూరల్, మే 13 : మండలంలోని అమరగిరి చెంచుగూడెంలో ఏ ర్పాటు చేసిన 262 పోలింగ్ బూత్‌లో రెం డు గంటలపాటు చెంచులు పోలింగ్‌ను బ హిష్కరించారు. సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభం కావాల్సిన పోలిం గ్.. 9 గంటలైనా ఒక్క ఓటు కూడా నమో దు కాలేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉన్నది. ఈవీఎంలు మొరాయించి పోలింగ్ ఆగిపోలేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడిచినా తా ము ఇంకా చీకట్లోనే మగ్గుతున్నామని, తమను వెలుగులోకి తీసుకొచ్చేంత వరకు ఓటింగ్‌లో పాల్గొనమని చెంచులు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల గాలిదుమారానికి చెట్టు విరిగిపడి కరెంట్ వైర్లపై పడడంతో తెగిపోయాయి.
దీంతో నాలుగు రోజులుగా చెంచుగూడేనికి వి ద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తమకు విద్యుత్ వెలుగులు అందించే వరకు ఓటేయబోమని చెంచులు భీష్మించుకు కూర్చున్నారు. విషయం తెలుసుకున్న తాసీల్దార్ శ్రీకాంత్ విద్యుత్ అధికారులతో కలిసి చెంచుగూడెంకు చేరుకొని చెంచు సంఘం నాయకులు, మాజీ ఉపసర్పంచ్ మల్లేశ్‌తో చర్చలు జరిపారు. విద్యుత్ పునరుద్ధరణ చేసే వరకు ఓట్లు వేసేది లేదని తెలపడంతో విద్యు త్ అధికారులు హడావుడిగా చెంచుగూడెంకు విద్యుత్ ను పునరుద్ధరించారు. అనంతరం ప్రజలు కేంద్రానికి చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు.