మహబూబ్‌నగర్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : గ్రామపంచాయతీ ఎన్నికల తుది ఘట్టానికి సర్వం సిద్ధమైంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో రెండు విడుతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడంతో చివ రి విడుత ఎన్నికలను కూడా అదే రీతిలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూ ర్తి చేసింది. ఒక్క అచ్చంపేట మినహా మిగతా చోట్ల అంతా ప్రశాంతంగా ఎన్నికల ప్రచారం ముగిసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 504గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా 1597మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 4,012 వార్డులకు గానూ 9,485మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలంలో ఐదు జీపీలను ఏజెన్సీ ఏరియాలో భాగంగా ఎస్టీలకు రిజర్వ్ చేశారు.
అయితే అక్కడ ఎస్టీలు ఎవరూ లేకపోవడంతో ఈ పంచాయతీలకు నామినేషన్లు దాఖలు కాలేదు. పంచాయతీలతోపాటు 40వార్డులకు కూడా ఎవరూ నామినేషన్ దాఖలు చేయలేదు. అలాగే చా రకొండ మండలంలో కూడా ఒక పంచాయతీకి నా మినేషన్ దాఖలు కాకపోవడంతో ఇక్కడ ఎన్నికలు నిర్వహించడం లేదు. ఇక్కడ కూడా 8 వార్డులకు నామినేషన్లు దాఖలు కాకపోవడంతో ఈ ఆరు పంచాయతీల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని శంకరాయపల్లి తండాలో కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. ఇక్కడ కూడా పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం లేదు. మొత్తం పైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా లో బుధవారం జరిగే పంచాయతీ తుది పోరుకు సర్వం సిద్ధం చేశారు.
మంగళవారం ఆయా జిల్లాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేసి పోలింగ్ సామగ్రిని , సిబ్బందిని, బ్యాలెట్ పేపర్లు, బాక్స్‌ను బందోబస్తు నడుమ పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉద యం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై మధ్యా హ్నం ఒంటిగంటకు ముగుస్తుంది. తిరిగి రెండు గం టలకు ఎన్నికల కౌంటింగ్ మొదలై సాయంత్రానికి ఫలితాలు విడుదల చేస్తారు. జిల్లాల్లో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని కలెక్టర్లు విజయేంద్ర బోయి, సిక్తా పట్నాయక్, బదావత్ సంతోష్ , బీఎం సంతోష్, ఆదర్శ సురభిలు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లా ఎస్పీల నేతృత్వంలో పంచాయతీల పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గత రెండు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్లు నువ్వా నేనా అనే రీతిలో పోటీపడ్డాయి. చివరి విడుత ఎన్నికల్లో కూడా మెజారిటీ స్థానాలు దక్కించుకుంటామని బీఆర్ఎస్ శ్రేణులు ధీమాతో ఉన్నాయి.
మొత్తం 504 పంచాయతీలకు..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు చివరి ఘట్టానికి చేరుకున్నది. మహబూబ్‌నగర్ జిల్లా లో ఏకగ్రీవాలు పోనూ 122 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 430 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 914 వార్డుల్లో 2,353మంది రంగంలో ఉన్నారు. గద్వాల జిల్లాలో 68జీపీలకు 216మంది పోటీలో ఉండగా 561వార్డులకు 1,283 మంది, నాగర్‌కర్నూల్ జిల్లాలో 134 జీపీలకు 393మంది, 1,060 వార్డులకు 2,446 మంది, నారాయణపేట జిల్లాలో 100 జీపీలకు 317మంది 775 వార్డులకు 1,773 మంది, వనపర్తి జిల్లాలో 80జీపీలకు 241మంది, 72 వార్డులకు 1,630మంది పోటీలో ఉన్నారు. చివరి విడుత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో అధికార పార్టీ ఓటర్లకు ప్రలోభ పెట్టడం.. విపక్ష క్యాండిడేట్లపై నిఘా పెట్టడం వంటి చర్యలు చేపడుతుండడంతో ఉత్కంఠగా మారాయి.
అచ్చంపేటలో టెన్షన్ టెన్షన్..
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఆగడాలు మితిమీరిపోతున్నాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. చివరి విడుత ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం.. ప్రలోభాలకు దిగడం.. చీరలు పంపిణీ చేయడంతోపాటు డబ్బులు కూడా పంచుతుండడంతో బీఆర్ఎస్ నేతలు అడ్డుకుంటున్నారు. అయితే ఈ వ్య వహారాన్ని పోలీసు యం త్రాంగం చూసీచూడనట్లు వదిలేస్తుండడంతో నల్లమల ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.
మొదటి రెండో విడుత ఎన్నిక ల్లో సీఎం రేవంత్‌రెడ్డి స్వగ్రామం చుట్టుపక్కల మొత్తం బీఆర్ఎస్ మద్దతుదారులు గె లుపు పొందడంతో.. పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులను గెలిపించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. సీఎం పేషీ నుంచి చీవాట్లు పడ్డాయని.. మెజార్టీ రాకపోతే పరువు పోతుందని కాంగ్రెస్ నాయకులే బహిరంగంగా చర్చించుకోవడం నిదర్శనంగా మారింది. రెండు రోజుల నుంచి అచ్చంపేట నియోజకవర్గంలో బహిరంగంగా డబ్బులు పంపిణీ, ఓటర్లకు ప్రలోభాల గురిచేయడం వంటి చర్యలతోపాటు బీఆర్ఎస్ నాయకులపై దాడులకు తెగబడుతున్నారు.
పోలింగ్‌కు సర్వం సిద్ధం
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో తుది విడుత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే అన్ని పంచాయతీలకు బందోబస్తు నడుమ బ్యాలెట్ పేపర్లు బాక్స్‌ను సిబ్బందిని పంపించారు. గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృత ఏర్పాట్లు చేశారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బీఎల్వోల ద్వారా ఇప్పటికే పోలింగ్ స్లిప్పులు ఇంటింటికీ పంపిణీ చేశారు. దాదాపు వంద శాతం పోలింగ్ స్లిప్పుల పంపిణీ పూ ర్తయిందని అధికార యంత్రాంగం చెబుతోంది. ఉద యం 7గంటల నుంచి ప్రారంభమయ్యే పోలింగ్‌కు ఏర్పాట్లు అన్ని పూర్తి చేసినట్లు కలెక్టర్ విజయేంద్ర బోయి నమస్తే తెలంగాణ ప్రతినిధికి వివరించారు. పోలింగ్ జరిగే మండలాల్లో డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ పరిశీలించి అధికారులకు దిశా నిర్ధేశం చేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు ఆయా జిల్లా ఎస్పీలు భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టారు.
ఆఖరిపోరుపై బీఆర్ఎస్ ధీమా..
రెండు విడుతల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కి చుక్కలు చూపించిన గులాబీ మద్దతుదారులతో హడలెత్తిపోయిన అధికార పార్టీ చివరి విడుతలో పరువు దక్కించుకునేందుకు నానా తంటాలు పడుతున్నది. ఏకంగా సీఎం సొంత మండలంలో బీఆర్ఎస్ సత్తా చాటడాన్ని జీర్ణించుకోలేక పోతున్నారు. అలాగే దేవరకద్ర , జడ్చర్ల , నారాయణపేట ఎమ్మెల్యేల స్వగ్రామాల్లో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు గెలవడంతో ఆ పార్టీ పరువు పోగొట్టుకుంది. ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, డీసీసీ అధ్యక్షుల గ్రామా ల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది.
అభ్యర్థులకు సరి సమాన ఓట్లు వచ్చినా సర్పంచ్, వార్డు స్థా నాల్లో అధికారులను అడ్డం పెట్టుకొని గెలిచినట్లు ఆ రోపణలు వినిపిస్తున్నాయి. ఇక తుది పోరులో ఇద్దరు మంత్రులు, ఇతర ఎమ్మెల్యేల స్వగ్రామాలు ఉండటంతో అక్కడ గెలవలేమని తెలిసి నోటి కి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ క్యాడర్‌ను బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే తప్పా అభివృద్ధి జరగదని మా ట్లాడుతున్నారు. బీఆర్ఎస్ జోరుకు భయపడి ఇక ప్రజల్లోకి వెళ్లలేమని తెలిసి క్యాడర్‌ను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు. అయినా బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తగ్గడం లేదు. చివరి పోరులో ఎన్నికల్లో కూడా కారు జోరు స్పష్టంగా కనిపిస్తోంది. మొత్తం పైన ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో బీఆర్ఎస్ దాటికి కాంగ్రెస్ కం చుకోట కూలిపోతుందని విశ్లేషకులు అంటున్నారు.