న్యూస్ నెట్వర్క్, జూన్ 7 : ముస్లింల త్యాగానికి ప్రతీకగా భావించే బక్రీద్‌ను ఉమ్మడి జిల్లాలో ముస్లింలు శనివారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా ఈద్గా, మసీదుల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేయగా వివిధ రాజకీయా పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు వారికి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.
వనపర్తిలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితోపాటు ఆయా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలు సైతం ముస్లింలను ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు.