నాడు చెత్తాచెదారంతో అస్తవ్యస్తంగా ఉన్న పల్లెలు నేడు సుందరంగా మారాయి. పల్లెప్రగతి గ్రామాల రూపురేఖలనే మార్చేసింది. ఈ కార్యక్రమంతో పచ్చదనం పర్చుకోగా.. పరిశుభ్రత ప్రణమిల్లుతున్నది. నిత్యం ఉదయం, సాయంత్రం గ్రామ పంచాయతీ ట్రాక్టర్లలో సిబ్బంది చెత్తను సేకరిస్తున్నారు. ఇంటింటికీ ఆకు పచ్చ, నీలం రంగు డబ్బాలను అందజేశారు. వేర్వేరుగా సేకరించినతడి, పొడి చెత్తను గ్రామ శివారుల్లోని డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. తర్వాత ఐదు రకాలుగా ప్లాస్టిక్, గాజు సీసాలు, చిత్తు కాగితాలు, ఇనుప సామాను, పాత సంచులుగా వేరు చేస్తారు. వీటిని పాత సామాను దుకాణాల్లో విక్రయిస్తుండడంతో ఆదాయం కూడా సమకూరుతున్నది. ఈ విధానం సత్ఫలితాలను అందిస్తున్నది. దీనివల్ల పల్లెల్లో సీజనల్ రోగాలు తగ్గడంతో పాటు పారిశుధ్యానికి బాటలు పడుతున్నాయి. పంచాయతీకి ఆదాయం సమకూర్చే వనరుగా మారింది.
నాగర్కర్నూల్, జనవరి 10 (నమస్తే తెలంగాణ) : గ్రామాల్లో పారిశుధ్య సేకరణ వి ధానం.. ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించడంతోపాటు పంచాయతీలకు ఆదాయవనరుగా మారుతున్నది. సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కా ర్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనంతోపా టు పారిశుధ్యానికి పెద్దపీట వేశారు. ఇందు లో భాగంగా ప్రతి గ్రామంలో డంపింగ్ యా ర్డుల నిర్మాణం చేపట్టారు. ఇంటింటి నుంచి చెత్తను సేకరిస్తున్నారు. ఇందుకుగానూ ప్రతి ఇంటికీ నీలం, ఆకుపచ్చ రంగుల చెత్తబుట్టలను ప్రభుత్వమే అందజేసింది. ఇక పంచాయతీలకు ఇచ్చిన ట్రాక్టర్ల ద్వారా ప్రతిరో జూ ఉదయం, సాయంత్రం పంచాయతీ ని ర్దేశించిన సమయానుకూలంగా సిబ్బంది చె త్తను సేకరిస్తున్నారు. తడి, పొడి చెత్తను వే ర్వేరుగా సేకరించి డంపింగ్యార్డులకు తరలిస్తున్నారు. సేకరించిన చెత్తను ఐదు రకాలుగా వేర్వేరు చేస్తున్నారు. మొదట ప్లాస్టిక్ ను, రెండో విధానంలో గాజు సీసాలు, మూ డో పద్ధతిలో చిత్తు కాగితాలు, నాలుగో కేటగిరీలో ఇనుప సామాను, చివరగా పాత సంచులుగా విభజిస్తున్నారు.
డంపింగ్యార్డుల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక గదుల్లో చెత్తను నిల్వ చేస్తారు. ఈ చెత్తను తూకం వేసి మండల పరిషత్ అధికారికి సమాచా రం అందిస్తారు. ఇలా నెలలో పోగైన వస్తువులను జిల్లా కేంద్రాల్లోని పాత సామాన్ల దుకాణాల్లో విక్రయిస్తారు. దీనిద్వారా వచ్చే డబ్బులను పంచాయతీ ఖాతాల్లో జమ చేస్తున్నారు. చివరగా డంపింగ్ యా ర్డులోని సెగ్రిగేషన్ షెడ్లో తయారైన వర్మీ కంపోస్టు ఎరువు చెత్త సేకరణలో ప్రత్యేకంగా నిలుస్తున్నది. ఈ ఎరువు పంచాయతీకి ఆదాయ వనరుగా మారుతున్నది. గ్రామాల్లో వ్యవసాయ ఉత్పత్తులు, పేడతో కూడిన చెత్తకు మంచి ఎరువుగా పేరుంటుంది. దీన్ని బహిరంగంగా విక్రయించినా మంచి ధర పలికే అవకాశమున్నది. అయితే, ప్రభుత్వం ఏటా హరితహా రం కార్యక్రమం బృహత్తరంగా నిర్వహిస్తున్నది. ఇందులో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో మొక్కల పెంపకం చేపడుతున్న వన నర్సరీలకు ఈ చెత్తను కే టాయిస్తున్నారు. ఇది మొక్కలకు మంచి పోషకాలను అందించి పంచాయతీ నర్సరీలకు లాభదాయకంగా మారుతున్నది.
పంచాయతీలకు ఆర్థికంగా లబ్ధి కలుగుతున్నది. నర్సరీలకు డంపింగ్ యార్డుల ద్వారా సేకరించిన ఎ రువును బట్టి ఉపాధి హామీ నుంచి డబ్బులు పంచాయతీ ఖాతాలకు సమకూరుతున్నాయి. ఇలా తడి, పొడి చెత్త సేకరణ పలు రకాలుగా ఆదాయ వనరుగా మారుతుండడంతోపాటు పల్లెలనూ పారిశుధ్యంగా మార్చుస్తున్నది. కొద్ది రోజుల కిందట పంచాయతీ శాఖకు నివేదించిన గణాంకాల ప్రకారం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా 96 శాతం చెత్త సేకరణ విజయవంతంగా జరుగుతున్నది. దీన్ని వంద శాతం చేసేలా పంచాయతీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వంద శాతం సేకరణకు చర్యలు..
ప్రతి రోజూ గ్రామా ల్లో చెత్త సేకరణ విజయవంతంగా సేకరించడం జరుగుతున్నది. తడి, పొడి చెత్తను ప్రత్యేక డ బ్బాల్లో సేకరించి ట్రా క్టర్ల ద్వారా డంపింగ్ యార్డులకు తరలిస్తు న్నాం. దీంతో గ్రామా ల్లో పారిశుధ్యం నెలకొంటున్నది. పొడి చెత్తను విక్రయించడం, తడి చెత్తను ఎరువుగా మార్చడంతో పంచాయతీలకు ఆదాయ వనరుగా మారుతున్నది. జిల్లాలోని 461 పంచాయతీల్లో 92 శాతం చెత్తను సేకరిస్తున్నాం. ప్రజలకు అవగాహన కల్పించి వందశాతం సేకరించేలా చర్యలు తీసుకుంటున్నాం.
– కృష్ణ, డీపీవో, నాగర్కర్నూల్