మహబూబ్‌నగర్, జనవరి 11 : మూడేండ్ల బాలుడిని వరుసకు మామ అయిన వ్యక్తి మా యమాటలు చెప్పి కిడ్నాప్ చేసిన ఘటన గురువారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. రూరల్ పోలీస్‌స్టేషన్‌లో మహబూబ్‌నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. తన కుమారుడిని ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని గురువారం తండ్రి పాత్లావత్ లాలు పొలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి 48గంటల్లో బాలుడిని సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు తెలిపారు.
జడ్చర్ల మండలంలోని కొత్తతండాకు చెందిన పాత్లావత్ లాలు భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలోని పద్మావతి కాలనీలో నివాసం ఉంటున్నా డు. అయితే వనపర్తి జిల్లా ఖిల్లాఘణపురం మండలం తిరుమలయాపల్లి గ్రామానికి చెందిన సభావత్ రాజు లాలుకి మే నత్త కుమారుడు. కొన్నిరోజులుగా లాలు రెండో కుమారుడు మూడేండ్ల విక్కీని ప్రేమగా చూసుకుంటూ రోజూ చాక్లెట్ ఇప్పిస్తూ మభ్యపెట్టేవాడు. ఈ క్రమంలో రాజు బుధవారం లాలు భార్య వద్ద స్కూటీ తాళం తీసుకొని పని ఉందని చెప్పి అంగన్వాడీ స్కూల్ వద్దకు వెళ్లి విక్కీ ని స్కూ టీపై ఎక్కించుకొని బట్టలు ఇప్పిస్తాను అని చె ప్పి జడ్చర్లకు తీసుకెళ్లాడు.
అక్కడ సావిత్రి అ నే మహిళను బస్టాండ్‌లో కలిసి ఆమెకు విష యం చెప్పకుండా తనవెంట రమ్మని బండిపై ఎక్కించుకొని వెళ్లారు. అయితే బాధితులకు రాజుపై అనుమానం రావడంతో పోలీసులకు అతడి సెల్‌ఫోన్ లోకేషన్ ద్వారా విజయవాడలో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి బాబుతో సహా రాజును మహబూబ్‌నగర్‌కు తీసుకొచ్చారు. పోలీసుల విచారణలో నిందితుడు తనకు లైంగిక వాంఛలు లేకపోవడంతో పెం డ్లి చేసుకోలేనని, పెండ్లి చేసుకున్నా పిల్లలు పు ట్టారని భావించి బాబును పెంచుకోవాలని కి డ్నాప్ చేశానని తెలిపాడు. ఈ మేరకు నిందితుడిపై కేసు న మోదు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపర్చి రిమాండ్‌కు తరలించనున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ కేసు చేధించిన ఎస్సై విజయ్ కుమార్, పోలీసు సిబ్బంది డీఎస్పీ అభినందించారు.