మహబూబ్నగర్ అర్బన్, నవంబర్ 17 : జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఇంటర్ రాష్ట్ర సాయి ఓపెన్ కరాటే చాంపియన్షిప్-2024 ట్రోఫీ ఆదివారం అట్టహాసంగా నిర్వహించారు. ఏఆర్ స్పోర్ట్స్ మార్ష ల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలను డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. ఈ పోటీలకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, బీహర్ నుంచి 250 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
కటాస్, అండర్-12 విభాగంలో మిడ్ల్యాండ్ స్కూల్ జడ్చర్ల క్రీడాకారులు మనో జ్ఞ, గీతాశ్రీ, సాయిదీప్, సంజన 5 బంగారు పతకాలు సాధించి ట్రోఫీని కైవసం చేసున్నారు. మరో విద్యార్థి సాత్విక్ బంగారు మోడల్ అందుకోగా, శ్రీ హనుమాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా క్రీడాకారులు అండర్-16 బ్లూ బెల్ట్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించా రు. ఈ సందర్భంగా ఏఆర్ అకాడమీ ఆర్గనైజర్ ర వినాయక్ మాట్లాడుతూ బాలికలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందు కు కరాటే ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో రవీంద్రకుమార్, చెన్నవీరయ్య, కోటకదిర వెంకటేశ్, రా జేశ్, విజయ్, క్రీడాకారులు తదితరులు ఉన్నారు.