మాగనూరు : మద్యం ( Alcohol ) సేవించి వాహనాలు ( Vehicle ) నడపరాదని మాగనూరు అశోక్ బాబు ( SI Ashok Babu ) అన్నారు. సోమవారం మాగనూరు ( Maganur ) పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై పలు వాహనదారులకు బ్రీత్ అనలైజర్‌తో డ్రంకన్ కండిషన్ తనిఖీ చేసి ముగ్గురిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు.
ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి జరిమానాతో పాటు జైలు శిక్ష ఉంటుందని వెల్లడించారు.
మద్యం సేవించిన కేసులు పునరావృత్తం అయితే వాహనాన్ని సీజ్, డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించి సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని సూచించారు.