మహబూబ్నగర్, జూన్ 8 : ఒక్కటే బీరు తాగి నా.. రెండు పెగ్గుల మందే తాగాను.. ఇంత శాతం ఎలా వచ్చింది ? అంత రాకూడదు అసలు ఇది సాధారణంగా మద్యం తాగి వాహనాలు నడిపి పోలీసులకు పట్టుబడిన వారి మధ్య సాగే చర్చ. కానీ వాహనదారుల రక్త నమూనాల్లో 30 మిల్లీ గ్రాముల మద్యం మోతాదు దాటితే కేసు నమోదవుతుంది. శారీరకంగా బలంగా ఉంటే ఒకరకంగా.. బలహీనంగా ఉంటే మరోరకంగా ఎంజీలు నమోదవుతుంటాయి.
ఇది తెలియకుండా కొంతమంది వాహనదారులు కొద్దిగానే తాగాం కదా అని వాహనాలు నడిపి పోలీసుల చేతికి చిక్కుతున్నారు. తాగి పట్టుబడే వారి విషయంలో న్యాయస్థానాలు సైతం కఠిన వైఖరి అవలంభిస్తున్నాయి. జైలు శిక్షలు విధిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా పోలీసు శాఖ విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తోంది. ప్రధానంగా జిల్లా కేం ద్రంతోపాటు ప్రధాన పట్టణాల్లో తనిఖీలు సాగుతున్నాయి. జాతీయ రహదారి పొడవునా ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
రాత్రి సమయాల్లో మద్యంతాగి ఎక్కువ మంది వాహనాలు నడుపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ప్రమాదాలు సైతం అదే సమయంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. గతేడాది జిల్లా వ్యాప్తంగా 1239 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేశారు. వీరికి న్యాయస్థానం రూ.27,14,300 జరిమానాలు విధించగా 9 మందికి జైలు శిక్షలు సైతం విధించారు. ఈ ఏడాది మరింత విస్తృతంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఈ ఏడాది జనవరి నుంచి జూలై వరకు 1239 మందిపై డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదు చేయగా రూ.15, 15,200 జరిమానాలు విధించింగా, ఆరుగురిని జైలుకు తరలించారు.
న్యాయస్థానాల కఠిన వైఖరి..
మద్యం తాగి వాహనాలు నడిపే విషయంలో న్యాయస్థానాలు సైతం కఠిన వైఖరిని ఆవలంభిస్తున్నాయి. మనిషి రక్తనమూనాల్లో 30 మిల్లీ గ్రాముల మద్యం మెతాదు నమోదయిందంటే చాలు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకు మించి నమోదైన వారికి జరిమానాలతోపాటు జైలు శిక్షలు విధిస్తున్నారు. ఇప్పటి వరకు విధించిన శిక్షలో రెండు నుంచి పదిరోజుల వరకు మద్యం బాబులకు జైలు శిక్షలు విధించారు. దీంతోపాటు రూ. 2100 నుంచి రూ. 2,500 వరకు మద్యం మోతాదును బట్టి జరిమానా వేస్తున్నారు. అయితే కొందరు మొదటిసారి పొరపాటు జరిగిందని మరోమారు ఇలాంటి పొరపాటు చేయమని పైకోర్టులకు వెళ్లినా ఇదే శిక్షను అమలు చేస్తూ తీర్పులను వెలువరించారు. మొత్తం గా జిల్లాలోని న్యాయస్థానాలు సైతం డ్రంకెన్ డ్రైవ్ విషయంలో కఠిన వైఖరి ఆవలంబిస్తున్నాయి. వాహనదారుల్లో మార్పులు రాకపోతే మాత్రం జైలు జీవితాలు గడపాల్సిన పరిస్థితులు ఏర్పడుతాయి.
30 ఎంజీ/100 ఎంఎల్
ట్రాఫిక్ తనిఖీల సమయంలో 30 ఎంజీ/100 ఎంఎల్నే ప్రామాణికంగా తీసుకుంటున్నారు. తక్కువ వస్తే పోలీసు అధికారులు జరిమానాలు విధించి వదిలేస్తున్నారు. బ్రీత్ ఆనలైజర్ పరీక్షలు నిర్వహించినప్పుడు 100 మిల్లీ లీటర్ల రక్తనమూనాల్లో 30మిల్లీ గ్రాముల మద్యం కంటే ఎక్కువగా ఉంటే కేసులు నమోదు చేస్తున్నారు. మద్యం తాగిన వెంటనే వాహనాలు తీసుకొని బయటికి వచ్చి పోలీసుల తనిఖీల్లో పట్టుబడుతుండడంతో ఒక్కొక్కరికీ 40 నుంచి 210 శాతం వరకు బీఏసీ నమోదు అవుతున్నా పరిస్థితులు జిల్లాలో ఉన్నాయి.
ఒక్క బీర్ తాగినా..
ఒక్క బీరులో సాధారణంగా 750 మిల్లీ గ్రాముల మద్యం ఉంటుంది. బీరు తాగి అదిరక్తంలో కలిసిపోతే బీఎసీ శాతం 40-50గా నమోదు అవుతుం ది. బీరు తాగిన గంటలోపు డ్రంకెన్ డ్రైవ్లో చిక్కితే బ్రీత్ ఎనలైజర్కు దొరికినట్టే ఒకవేళ తాగిన గంట తర్వాత డ్రంకన్ డ్రైవ్లో చిక్కితే బీఏసీ 30 శాతం వరకు ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఒక్క బీరు తాగి బండి నడిపినా కేసు నమోదు కావడం తప్పనిసరనే విషయం వాహనాదారులు గుర్తించాలి. ఒక్క బీరు తాగితేనే ఈ పరిస్థితి ఉంది. కానీ ప్రస్తుతం యువత రెండు నుంచి ఆరు బీర్లు వరకు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. జిల్లాలో నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఎక్కువగా చిక్కేది దిగువ మధ్య తరగతివారే. వీరిలో ఎక్కువ మంది చీప్ లిక్కర్ తీసుకుంటున్నారు. ఎక్కువ ధర గల మద్యం కంటే చీప్ లిక్కర్లో ఆల్కహాల్ శాతం అధికంగా ఉంటుంది. దీంతో శ్వాస పరీక్ష నిర్వహించినప్పుడు బీఏసీ శా తం కూడా ఎక్కువగా నమోదవుతోంది.
మనిషి సామర్థ్యం కూడా..
కొంత మంది ఎక్కువ బీర్లు.. మద్యం తాగినా ఒక్కోసారి బ్రీతింగ్ ఎనలైజర్లకు చిక్కరు. మద్యం తాగిన అందరిలో మత్తు ఒకేలా ఉండదు. శారీరకం గా బలమైన వ్యక్తి రక్తనమూనాల్లో మద్యం శాతం తక్కువగా నమోదైతే బలహీనుడి నమూనాల్లో ఎక్కువ శాతం నమోదు అవుతుంది. మద్యం తాగిన మూడు గంటల తర్వాత పరిశీలన చేస్తే నిర్ణీత పరిమితి కంటే తక్కువకు చేరుకునేందుకు అవకాశం ఉంటుంది.
మద్యంతాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు..
వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లో మ ద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్య లు తీసుకుంటాం.. జైలుకు పంపిస్తాం. మద్యం తాగడం చట్టం ప్రకారం నే రం. ఇలా తాగి వాహనాలు నడప డం వలన చాలా వరకు ప్ర మాదాలకు గురవుతున్నారు. దీంతో కుటుంబాలు సైతం ఇ బ్బందులు పడతాయి. మద్యం తాగి వాహనాలు నడిపిన వా రికి న్యాయస్థానాలు జరిమానాలు విధించడంతోపాటు జైలు శిక్షలు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించేందు కు నిర్ణ యం తీసుకున్నాం.
– డీ జానకి, ఎస్సీ, మహబూబ్నగర్ జిల్లా