దేవరకద్ర రూరల్ (కౌకుంట్ల), సెప్టెంబర్ 22 : కౌకుంట్ల మండల కేంద్రంలో గత రెండు రోజులుగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే మన్యంకొండ వద్ద మిషన్ భగీరథ పైపులైన్ పనులకు మరమ్మతులు నిర్వహిస్తున్నారని అందుకే తాగునీటి సరఫరా నిలిచిపోయిందని పంచాయతీ సిబ్బంది చెబుతున్నారు. గ్రామంలో గతంలో మిషన్ భగీరథతోపాటు బో ర్ల ద్వారా కూడా తాగునీటి సరఫరా చేసేవారని, ప్రస్తుతం అవి కూడా పనిచేయకపోవడంతో ప్రజలకు తాగునీటి తంటాలు తప్పడం లేదు. పంచాయతీ సిబ్బం ది ట్యాం కర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ఎవరికీ సరిపోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒక్క రోజు కూడా తాగునీటి కోసం రోడ్డుపైకి వచ్చిన పరిస్థితి లేదని, నేడు మళ్లీ బిందెలు పట్టుకొని ట్యాంకర్ల వద్దకు పరిగెత్తే పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి తాగునీటి సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
హన్వాడ, సెప్టెంబర్ 22 : ప్రస్తుతం వర్షాకాలం అన్ని చెరువులు, కుంటలు నిండి బోరుబావులలో ్లనీటిమట్టం పెరిగినా గ్రామాల్లో మూడు రోజుల నుంచి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారంటే అధికారుల నిర్లక్ష్య మా.. ప్రభుత్వ అసమర్థతా అర్థం కావడం లేదు. మండలంలోని టంకర, గుడ్డిమల్కాపూరం, బుద్దారం, రాంనాయక్తండాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా కాకపోవడంతో తాగునీటి కోసం రాత్రి పగలు తేడా లేకుండా గ్రామం చుట్టు పక్కల బోర్ల వద్దకు పరుగులు తీస్తున్నారు. మిషన్ భగీరథ పైపులైన్ లీకెజీతో మూడు రోజులు తాగునీటికి ఇబ్బంది ఉంటే ఆ సమస్యను పరిష్కరించినా మళ్లీ మూడు రోజుల నుంచి తాగునీటికి గ్రామస్తులు నానా తంటాలు పడుతున్నారు. అధికారులు స్పందించడం లేద ని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే బోయపల్లి గ్రా మం సమీపంలో ఓ తండా దగ్గర పైపులైన్ లీకేజీ అయ్యిందని, వాటికి మరమ్మతులు చేస్తున్నారని త్వరలోనే తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామని చెబుతున్నారు.