వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నా.. విద్యాలయాల్లో నీటి గోస మాత్రం తీరడం లేదు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని అర్బన్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థులు పానీ కోసం పాట్లు పడుతున్నారు. బోరు మోటర్ చెడిపోవడంతో పాఠశాల ఆవరణలోని ప్రైవేట్ బోరు నీటితో 120 మంది అవసరాలు తీర్చుకుంటున్నారు. ఇందుకోసం పొద్దుగాల లేచిందే తడువు బకెట్లు పట్టుకొని బోరు వద్ద బారులుదీరుతున్నారు.
అలాగే అయిజ కేజీబీవీలో మోటర్ పనిచేయకపోవడంతో విద్యార్థినులు చేతిపంపును ఆశ్రయిస్తున్నారు. కేటీదొడ్డి మండలం కొండాపురంలో నీటికి కటకట ఏర్పడింది. కొన్ని వార్డులకు మిషన్ భగీరథ నీరు సరఫరా కాకపోవడంతో తప్పని పరిస్థితుల్లో సమీపంలోని వ్యవసాయ బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కోసం విద్యార్థులు, ప్రజలు ఇక్కట్లు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
– నెట్వర్క్ మహబూబ్నగర్, సెప్టెంబర్ 9
పాఠశాలలో ఉన్న మోటర్ రిపేర్ చేయించి నా మళ్లీ కాలిపోయింది. దీంతో 15 రోజులుగా నీళ్ల కోసం అవస్థలు పడుతు న్నాం. అందరూ వచ్చి చూసి వెళ్తున్నారే తప్పా ఎవరూ సమస్యను పరిష్కరించడం లేదు. నిత్యం పాఠశాల సమీపంలోని బోరు వద్దకువెళ్లి వరుసలో నిలబడి నీటిని తెచ్చుకుంటున్నాం. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
– వినయ్, 8వ తరగతి, చింతలకుంట
పాఠశాలలో 120 మంది విద్యార్థులకుగా నూ రెండు బాత్రూంలే ఉన్నాయి. విధిలేని పరిస్థితుల్లో సమీపంలోని బో రు మోటర్ వద్ద నీటిని తె చ్చుకొని ఆరుబయటే స్నా నాలు చేయడంతోపాటు బట్టలు ఉతుక్కుంటున్నాం. మలవిసర్జనకు కూడా బయటకు పోవాల్సిందే. పగలు ఇబ్బం ది లేదు. రాత్రివేళ పాఠశాల ఆవరణలో పా ములు సంచరిస్తుండడంతో బయటకు రావాలంటేనే భయం వేస్తుంది. అధికారులు తమ సమస్యలను పరిష్కరించాలి.
– శివరాజ్, 8వ తరగతి, బోయిలగూడెం