అయిజ, సెప్టెంబర్ 9 : అయిజ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలలో తాగునీటికి కటకట ఏర్పడింది. పాఠశాలకు సరఫరా చేసే బోరు మోటరు వారం కిందట కాలిపోయింది. మోటర్‌కు మరమ్మతు చేయపోవడంతో విద్యార్థినులకు పాఠశాల ఆవరణలోని చేతిపంపు నీరే ఆధారమైంది. ఈ విషయమై ప్రత్యేకాధికారి చెన్న బసమ్మ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో విద్యార్థినులు వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నా రు. మిషన్ భగీరథ నీరు వస్తున్నప్పటికీ పట్టుకునేందుకు ఎక్కువ సమ యం అవుతున్నది.
బోరు మోటర్ నీరు నేరుగా బాత్ రూంలకు స ైప్లె ఉండడంతో స్నానాలు తొం దరగా చేసేందుకు అవకాశం ఉండేది. ప్రస్తుతం బోరు మోటర్ పనిచేయకపోవడంతో బకెట్లతో చేతి పం ప్నీరు పట్టుకొని కాలకృత్యాలు, స్నానాలు, దుస్తుల శుభ్రతకు వినియోగిస్తున్నా రు. చేతిపంపు వ ద్ద గంటల తరబడి నిల్చొని నీరు పట్టుకుంటున్నట్లు విద్యార్థినులు తెలిపారు. చేతి పంప్ వద్ద నిల్చుండడంతో తరగతులకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వాపోయారు. సోమవారం పాఠశాల ఆవరణలో విద్యార్థినులు నిరసన తెలుపగా, బీఆర్ఎస్వీ నాయకులు మద్దతు ప్రకటించారు.
ప్రభుత్వ అసమర్థతో ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాలు, కేజీబీవీల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులు తిప్పలు పడుతున్నారని బీఆర్ఎస్వీ జిల్లా నా యకుడు కురువ పల్లయ్య ఆరోపించారు. సోమవారం కేజీబీవీ పాఠశాలకు చేరుకొని పాఠశాల సమస్యలను విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్ర భుత్వం విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు.
బడుగు, బలహీన వర్గాల పిల్లలు చదువుకునే విద్యాసంస్థలపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు చూస్తున్నదన్నారు. వారం రోజులుగా నీటి ఇబ్బందులు తలెత్తినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. కేజీబీవీ పాఠశాలలో నీటి వసతి కల్పించడంతోపాటు అవసరమైన సబ్జెక్టులకు ఫ్యాకల్టీ లేదని, దీంతో విద్యార్థినుల విద్యాభ్యాసం కూడా కుం టుపడుతుందన్నారు. కలెక్టర్ వెంటనే కేజీబీవీకి నీటి వసతితోపాటు ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు మ త్తలి, రాజు, విద్యార్థినులు పాల్గొన్నారు.