నవాబ్‌పేట, మార్చి 1: మండలంలోని రుక్కంపల్లిలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్నది. కాకర్లపహాడ్ శివారులోని ప్రధాన ట్యాం కు నుంచి మిషన్ భగీరథ నీరు సక్రమంగా రావడం లేదు. విద్యుత్, టెక్నికల్ సమస్యల పేరుతో సరఫరాను కొనసాగించ డం లేదు. దీంతో గ్రామస్తులు దాహార్తితో అలమటిస్తున్నారు.
ముఖ్యంగా ఎస్సీ కాలనీలో సమస్య జఠిలంగా ఉన్నది. నీటి కోసం బిందెలు పట్టుకొని మహిళలు గ్రామ శివారులోని బోర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు. ప్రతిరోజూ వదలాలంటే ఎవ రూ ఒప్పుకోవడం లేదని వాపోతున్నారు. అధికారుల దృష్టికి సుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈ షమీయుల్లాఖాన్ను వివరణ కోరేందుకు యత్నించగా.. అందుబాటులోకి రాలేదు. పంచాయతీ కార్యదర్శి సుష్మాభారతిని సంప్రదించగా.. ప్రధాన ట్యాంక్ నుంచే నీరు రావడం లేదు, మా పొరపాటు లేదని చెప్పుకొచ్చారు.