జడ్చర్ల టౌన్, అక్టోబర్ 19 : జడ్చర్ల మండలం ఆలూర్ పంచాయతీ పరిధిలోని యాసాయికుంట తండాలో తాగునీటి కష్టాలతో స్థానికులు అవస్థలు పడుతున్నారు. 15రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా కాకపోవటంతో తండావాసులు ఆదివారం ఖాళీబిందెలతో ఆందోళనకు దిగారు. జడ్చర్ల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న యాసాయికుంట తండాలో 70ఇండ్లు ఉండగా, దాదాపు 400 మంది జనాభా ఉన్నారు. మిషన్ భగీరథ నీటి పైపులైన్లు దెబ్బతినటంతో 15రోజులుగా యాసాయికుంట తండాకు నీటి సరఫరా నిలిచిపోయింది.
దీంతో తాగునీటి కోసం తండావాసులు తండా శివారులోని వ్యవసాయ పొలాలకెళ్లి బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నా రు. మహిళలు, చిన్నారులు తెల్లవారితే నీటి కోసం ఖాళీ బిందెలతో వ్యవసాయ పొలాల కు తరలిపోతున్నారు. తండాలో తాగునీటి క ష్టాలు ఉన్నాయని వెంటనే తాగునీటి సరఫ రా చేయాలని గ్రామ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు ఎంపీడీ వో కార్యాలయ అధికారులకు విన్నవించినా తాగునీటి సమస్య పరిష్కరించేందుకు చ ర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాగునీటి కష్టాలు తీర్చాలంటూ ఖాళీ బిందెలతో ఆదివారం ఆందోళన చేపట్టారు.