Harish Rao | కేసీఆర్కు,మా అందరికి ఇష్టమైన నాయకుడు డా.సి.లక్ష్మారెడ్డి అని మాజీ మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ తొలినాళ్లలో ఆయన బీఆర్ఎస్లో చేరిండు. నేను లక్ష్మారెడ్డి చాలా దగ్గరగా పనిచేసినమన్నారు.
మా అందరికీ ఇష్టమైన నాయకుడు అని ఎందుకున్నానంటే.. ఈ రోజుల్లో సర్పంచ్ పదవీకే రాజీనామా చేయాలంటేనే ఎవరైనా ఆలోచిస్తారు..మళ్లీ కనిపిస్తరా..? లేకపోత ఎంపీటీసీ పదవికి రాజీనామా చేయి అంటే తెల్లవారే సరికే పార్టీ మారుతడు. రేవంత్ లాంటోడు రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇస్తడు. తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే జిరాక్స్ కాగితం ఇచ్చిండు రేవంత్ రెడ్డి. కానీ ఇక్కడ ఉద్యమం బలంగా లేదు. మహబూబ్నగర్ జిల్లాలో గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అని హరీశ్ రావు అన్నారు.
మేం అసెంబ్లీలో కూర్చున్నం. మా దగ్గరైతే కొంచెం కష్టమేనే.. మీ ఉత్తర తెలంగాణలో వచ్చినంత ఊపు అప్పుడింకా మహబూబ్ నగర్లో రాలేదు. నేను గెలుస్తనో.. గెలువనో నాకు డౌటే ఉన్నది కానీ మన నాయకుడు కేసీఆర్ చెప్పిండు నిజాయితీగా రాజీనామా చేస్తా అన్నరు. అప్పుడు నాకు తెలుసు 26 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది ఆఫర్లు ఇస్తే అమ్ముడుపోయిర్రు. ఇదే లక్ష్మారెడ్డన్నకు కూడా చాలా ఆఫర్లు వచ్చినయ్. కానీ నాకు ఏ ఆఫర్లు వద్దు. తెలంగాణ ముద్దు అని చెప్పి రాజీనామా చేసిన నాయకుడు మీ లక్ష్మారెడ్డి.
పాపం దాని ఎఫెక్ట్ ఏందో తెలుసా..?2009లో మనం పొత్తు పెట్టుకున్నం. రాజకీయ ప్రక్రియలో అన్నీ పార్టీలను ఒప్పించి మెప్పించి తెలంగాణ తేవాలనేది కేసీఆర్ ఆలోచన. అప్పుడు తెలుగు దేశంతోనే జై తెలంగాణ అనిపించి.. వాళ్ల మెడలో కూడా గులాబీ కండువా వేయించి మనం టీడీపీతో పొత్తు పెట్టుకున్నం. ఆ పొత్తుల్లో పాపం లక్ష్మారెడ్డికి టికెట్ రాలే. ఇంకొకరైతే వేరే పార్టీలోకి వెళ్లి టికెట్ తెచ్చుకుంటడు. టికెట్ రాకపోయినా నాకు తెలంగాణ ముఖ్యం.. కేసీఆర్ ముఖ్యం అని చెప్పి పార్టీలో ఎంపీగా కేసీఆర్ గెలుపు కోసం కృషి చేసిన వ్యక్తి, నిజాయితీ కలిగిన ఉద్యమకారుడు, ఒక నాయకుడు మీ డాక్టర్ లక్ష్మారెడ్డి.. అందుకే ఆయనంటే మాకందరికీ ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చారు హరీశ్ రావు.
Live: జడ్చర్ల నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంhttps://t.co/iCQZ2lsUUV
— BRS Party (@BRSparty) June 30, 2026