గద్వాల, సెప్టెంబర్ 6 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు రంగులు మార్చి ఇం దిరమ్మ ఇండ్ల పేరుతో ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటని, మా ర్పంటే రంగులు మార్చడమేనా అని బీఆర్ఎస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంత్ నాయుడు ధ్వజమెత్తారు. శనివారం గ ద్వాల నియోజకవర్గంలో మంత్రుల పర్యటనలపై బాసు హనుమంతు నాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ సర్కారులో 41ఎకరాల్లో రూ.85 కోట్లతో 1,275 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించినట్లు గుర్తుచేశారు.
వాటిని కాంగ్రెస్ సర్కారు తామే నిర్మించి ఇస్తున్నట్లు రంగులు మార్చి హడావుడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వీరి వ్యవహారం చూస్తుంటే సొమ్ము ఒకరిది.. సోకు మరొకరిది అన్న సామెత గుర్తుకు వస్తుందని మండిపడ్డారు. ప్రారంభోత్సవాలకు వచ్చిన కాంగ్రెస్ స ర్కారు మంత్రులను ప్రజలు నిలదీస్తారనే భయంతో ముందుగానే బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద తాగు రు, కరెంటు, సీసీ రోడ్డు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకుండానే స్థానిక ఎన్నికల కోసం హడావుడిగా ప్రారంభించడం సరికాదన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజారెడ్డి, మో నేశ్, చక్రధర్ రెడ్డి, రాజు, శ్రీనివాస్ గౌడ్, వెంకటేశ్ నాయుడు, శ్రీరాములు, నరసింహులు, గోవర్ధన్, గోవిందు తదితరులు పాల్గొన్నారు.
గట్టు, సెప్టెంబర్ 6 : మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడమేమిటని పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతు ప్రశ్నించారు. మంత్రులు పొంగులేటి, జూపల్లి, శ్రీహరి గద్వాల పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. అనంతరం హనుమంతునాయడు, మరికొందరు నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు.