మహబూబ్‌నగర్ కలెక్టరేట్, జనవరి 2 : నిర్మాణాలు పూర్తయిన డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని జిల్లా అధికారులను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి కోరారు. డిసెంబర్ 31వ తేదీన ‘గృహయో గం ఎప్పుడో..?’ అన్న శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ఇచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గురువారం మహబూబ్‌నగర్ కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కా న్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ విజయేందిరబోయి, అదనపు కలెక్టర్ మోహన్‌రావు, జిల్లా అధికారులతో ఎమ్మెల్యే ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లావ్యాప్తం గా డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు, పురోగతిపై సమీక్షించారు. పూర్తయిన ఇండ్ల వద్ద మౌళిక వసతులు కల్పించాలని ఆదేశించారు. నీటి కనెక్షన్ లేని ఇండ్లను మిషన్ భగీరథ అధికారులు పరిశీలించి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని మౌలాలిగుట్ట, ఏనుగొండ, మదనపల్లితండా, అల్లీపూర్, చౌదర్పల్లి, ఓబులాయపల్లి, కోడూరు, ఫతేపూర్, యారోనిపల్లిలో నిర్మాణాలు పూర్తయిన వాటిని లబ్ధిదారుకు కేటాయించాలని సూచించారు. మంజూరు చేసిన రూ. 9.07 కోట్లతో కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలన్నారు.
హౌసింగ్ అధికారి భాస్కర్ మాట్లాడుతూ మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో 3,550 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయగా 2,929 పూర్తి చేసినట్లు తెలిపారు. ఇంకా 410 ఇండ్లు నిర్మాణ దశల్లో.. 211 నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని తెలిపారు. ఇప్పటి వరకు 2,667 ఇండ్లు కేటాయించినట్లు వివరించారు. అనంత రం వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. సమావేశంలో ముడా చైర్మన్ లక్ష్మణ్, నీటి పారుదలశాఖ ఎస్ఈ చక్రధరం, పంచాయతీరాజ్ ఈఈ నరేందర్, మిషన్ భగీరథ గ్రిడ్ ఈఈ వెంకట్‌రెడ్డి, ఇంట్రా ఈఈ పుల్లారెడ్డి, ఆర్డీవో నవీన్, అధికారులు పాల్గొన్నారు.