కోస్గి, జూలై 3 : కోస్గి మండలంలోని తొగాపూర్-పోతేపల్లి గ్రామాలను కలుపుతూ వేస్తున్న కొత్త రోడ్డు ప్రభుత్వం రైతుల మధ్య వివాదానికి దారి తీసింది. కొం దరి స్వార్థం కోసం ఇక్కడ లేని రోడ్డును వేస్తూ తమ పొ లాలను లాక్కుంటున్నారని రైతులు వాపోతున్నారు. తామంతా డబ్బు ఏండ్లుగా అక్కడ వ్యవవసాయం చేసుకుంటున్నామని మా ఎద్దులబండ్లు, పశువులు వెళ్లడానికి మాత్రమే పొలాల మధ్య దారి ఉందని చెబుతున్నారు. కానీ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అసలు అక్కడి నుంచి రోడ్డు వేస్తే ఏం లాభమో కూడా అధికారులే చెప్పాలి.
వారు చెప్పినట్టు రహదారి నిర్మిస్తే రెండు గ్రామాలకు ఎలాంటి ఉపయోగం లేదని చెబుతున్నారు. తామంతా అభివృద్ధికి ఆటంకం కాదని.. కానీ ఇలా పనికిరాని పనులతో తమ భూములను లాక్కొని ఇబ్బందులకు గురిచేసి ఎవరి మెప్పు కోసం చేస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏండ్లుగా తాము వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నామని కనీసం తమకు చిన్న సమాచారం కూడా ఇవ్వకుండా విత్తనాలు వేసిన పంటలను నాశనం చేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు గ్రామాలకు వెళ్లడానికి అనేక రహదారులు ఉన్నాయని ఇక్కడ అవసరం లేకున్నా కొందరి స్వార్థం కోసం ఈ రహదారి నిర్మిస్తున్నారని అన్నారు. తామంతా రేవంత్రెడ్డి మాటలు విని ముఖ్యమంత్రిని చేస్తే ఇప్పుడు తమ పొలాలు గుంజుకొని తమకే అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే విషయంలో రోడ్డు పనులను పర్యవేక్షిస్తున్న ఏఈ అంజిరెడ్డిని రైతులు ఈ రోడ్డు వేసి మా భూములను లాక్కోవద్దని ప్రాధేయపడినా అతను వినకుండా వారిని బెదిరింపులకు గురిచేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారిం ది.
దీంతో కొందరు కాంగ్రెస్ పెద్దలు మధ్యలో ప్రవేశించి రైతులతో మాట్లాడుతూ కేవలం 20 ఫీట్ల రోడ్డు మాత్రమే వేస్తారని నచ్చచెప్పడంతో కాస్తా వెనక్కి తగ్గిన రైతులు మళ్లీ అధికారులు మాట తప్పి 18 ఫీట్ల రోడ్డు ఇరువైపులా ఆరు ఫీట్ల ఖాళీ స్థలం ఉంటదని చెప్పడంతో రైతులు ఏఈతో వాగ్వాదానికి దిగారు. ఎవరు ఎన్ని చెప్పినా వినేది లేదని ఏఈ రైతులపై ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభు త్వ భూమి అంటున్నారు.. ఆధారాలు చూపమంటే చూపడం లేదని మండిపడుతున్నారు. తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్నామని పట్టా పాసు పుస్తకాలు ఉన్నాయని చెబుతున్నా అర్ధరాత్రి సైతం రోడ్డు పనులు కొనసాగించారని ఆరోపించారు.
అధికారులు మా భూములు లాక్కుంటే నాయకులు మమ్మల్ని మోసం చేశారని రైతులు కోర్టును ఆశ్రయించారు. అన్ని అంశాల ను పరిశీలించిన న్యాయస్థానం అక్కడ ఎలాంటి ప నులు జరపవద్దని ఉన్న భూమి ఉన్నట్టే ఉంచాలని రెండు రో జుల కిందట స్టేటస్కో విధించింది. దీంతో రైతులు న్యా యస్థానం ప్రతిని ఏఈకి అందించి రోడ్డుపనులు ఆపమని కోరగా అందుకు ఆయన నిరాకరించారని రైతులు చెబుతున్నారు.
ఈ విషయంపై ఏఈ అంజిరెడ్డిని వివరణ కోర గా రోడ్డు పనులు జరుగుతున్న భూమి మొత్తం ప్రభుత్వానిదే. 1985 నుంచే ఆ భూమి ప్రభుత్వ పరిధిలో ఉ న్నది. రైతులే కొద్దికొద్దిగా భూమి మొత్తం కబ్జా చేశారు. రైతులు దరఖాస్తు చేసుకుంటే భూమికి సంబంధించిన వివరాలు ఇస్తాం. న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులు మాకు ఇంకా అధికారికంగా రాలేదు. వచ్చాకా ఉన్నతాధికారులతో మా ట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.